12ఏళ్ళ తర్వాత బృహస్పతి తిరోగమనం; విప్రీత్ రాజయోగం: ఈ రాశుల దశ తిరిగినట్టే!!
12 సంవత్సరాల తరువాత అరుదైన ఘటన జ్యోతిషంలో చోటు చేసుకోబోతుంది. 12ఏళ్ళ తర్వాత బృహస్పతి తిరోగమనం సెప్టెంబర్ 4వ తేదీన సాయంత్రం 4 గంటల 58 నిమిషాలకు జరగబోతుంది. మేషరాశిలో బృహస్పతి తిరోగమనం వైపుకు మారుతుంది. అది డిసెంబర్ 31 2023 నాటికి ప్రత్యక్షంగా మారుతుంది. బృహస్పతి తిరోగమన సమయంలో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి వి ప్రీత్ రాజయోగంతో అదృష్టం కలిసొస్తుంది.
బృహస్పతి తిరోగమనంలో విప్రీత్ రాజయోగం ఏర్పడడం వల్ల మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఆర్థిక లాభాలను చూస్తారు. భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఇదే సరైన సమయం.

పాత సమస్యలకు పరిష్కారం దొరకడమే కాకుండా, ఆదాయ మార్గాలు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలోను ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం ఉండదు. బృహస్పతి తిరోగమనం తో ఏర్పడే విప్రీత్ రాజయోగం వల్ల సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. అదృష్టం వీరి పక్కనే ఉండి నడిపిస్తుంది. మీరు ఎప్పటినుంచో పరిష్కారం కాని సమస్యల నుంచి బయటపడటానికి ఇది సరైన సమయం.
మేషరాశిలో బృహస్పతి తిరోగమనంతో మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో వివిధ రకాల కార్యకలాపాలను పూర్తి చేయడానికి కావలసిన ఆరోగ్యం కూడా ఉంటుంది. ఏపని చేసినా తిరుగేలేని ఫలితాలు వస్తాయి.
బృహస్పతి తిరోగమనంలో వి ప్రీత్ రాజయోగం ఏర్పడడం వల్ల మీనరాశి జాతకులకు బాగా కలిసొస్తుంది. మీన రాశి జాతకులు అనుకున్న పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. మీరు ఏ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా లాభాలు అర్ధించే అవకాశం ఉంటుంది. ఆర్థిక పురోగతికి అవకాశం ఉంటుంది. బృహస్పతి తిరోగమనం మొత్తం సంపద వృద్ధికి దారితీస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకుల ఆరోగ్యం కూడా బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications