అక్టోబర్ లో మొదలుపెట్టి 5నెలలు వీరికి డబ్బుల మూటలను చేరవేసే బృహస్పతి!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతికి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. దేవగురువు బృహస్పతి వచ్చే నెలలో తిరోగమన దశలోకి వెళుతున్నాడు. బృహస్పతి తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న బృహస్పతి అక్టోబర్ 9వ తేదీ తిరోగమనం చెందుతాడు.
బృహస్పతి తిరోగమన సంచారం
ఫిబ్రవరి 4 2025 వరకు ఇదే తిరోగమనంలో సంచరిస్తాడు. ఇక బృహస్పతి తిరోగమన సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వీరికి ఫిబ్రవరి వరకు సంపదలు కలిసొస్తాయి. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి బృహస్పతి తిరోగమనం కలిసి వస్తుంది .ఈ సమయంలో ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి వస్తుంది. మిధున రాశి వారు ఏ లక్ష్యాలను నిర్దేశించుకున్న విజయం సాధిస్తారు. వ్యాపారం చేసేవారు మంచి లాభాలను ఆర్జిస్తారు.
కర్కాటక రాశి
బృహస్పతి తిరోగమనం కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో మంచి పురోగతి సాధిస్తారు. వీరికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. ఊహించని లాభాలను పొందుతారు..
కన్య రాశి
బృహస్పతి తిరోగమనం కన్యా రాశి వారికి ఆర్థిక లాభాలను చేకూరుస్తుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసొస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు అధిక లాభాలను పొందుతారు. ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు బృహస్పతి తిరోగమనం కారణంగా అనేక లాభాలను పొందుతున్నారు. వృశ్చిక రాశి వారి కెరీర్ లో అపారమైన విజయాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన లాభాలను పొందుతున్నారు.. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరుగుతుంది.
ధనుస్సు రాశి
బృహస్పతి తిరోగమన కారణంగా ధనస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుంచి భారీ లాభాలను పొందుతారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు కెరీర్ కు చాలా ఉపయోగపడతాయి. ఉద్యోగం చేసే వారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications