బృహస్పతి తిరోగమనంతో ఈ రాశులవారికి కుబేర కటాక్షం

దేవగరువు బృహస్పతి 2024లో మే ప్రారంభం నుంచే వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది మే 13 వరకు బృహస్పతి వృషభరాశిలోనే సంచరిస్తాడు. ఇక 2024 అక్టోబర్ నెలలో బృహస్పతి తిరోగమనంలో ప్రయాణం మొదలుపెడతాడు. బృహస్పతి తిరోగమనం కారణంగా అన్ని రాశుల వారి పైన ప్రభావం పడుతుంది.

బృహస్పతి తిరోగమనం
అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు బృహస్పతి వృషభ రాశిలో తిరోగమన దిశలో ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. 2025 ఫిబ్రవరి 4 వరకు బృహస్పతి తిరోగమనములోనే సంచరిస్తాడు. అయితే బృహస్పతి తిరోగమనం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Jupiter retrograde in Taurus gives wealth and kubera blessings to these zodiac signs upto February 2025

మిధున రాశి
బృహస్పతి తిరోగమనం వల్ల మిధున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరు చేసే ప్రతి పనిలోనూ సానుకూల ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగాలు చేసేవారు గొప్ప పురోగతిని సాధిస్తారు. వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది. సంపద పెరగడంతో పాటు ఇంట్లో శాంతి, ఆనందం ఉంటాయి. గురు గ్రహ తిరోగమనం వల్ల మిధున రాశి వారు రోగాల బారి నుండి బయట పడతారు.

కన్యారాశి
బృహస్పతి తిరోగమనం కన్యారాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది. కన్య రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక లాభాలను పొందుతారు. ఆదాయ వనరులు కనిపిస్తాయి. కెరీర్ లో అఖండ విజయాలను సాధిస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పిల్లలనుండి శుభవార్తలు వింటారు .ఈ సమయంలో ఏ పని చేసిన కలిసొస్తుంది.

వృశ్చిక రాశి
బృహస్పతి తిరోగమనం కారణంగా వృశ్చిక రాశి వారు సంపన్నులవుతారు. ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరి అదృష్టానికి తిరుగు ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి .న్యాయవివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి పురోగతి లభిస్తుంది. దీర్ఘకాలంగా తగ్గకుండా బాధిస్తున్న వ్యాధుల నుండి బయటపడతారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+