జులైలో బృహస్పతి ఉదయంతో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టే రాశులవారు వీరే!

జులై మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాలలో అనేక మార్పులు జరగబోతున్నాయి. జులై 9వ తేదీ రాత్రి 10 గంటల 50 నిమిషాలకు మిధున రాశిలో బృహస్పతి ఉదయిస్తున్నాడు. మిధునరాశిలో బృహస్పతి ఉదయం కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో శుభ ఫలితాలు వస్తున్నాయి. బృహస్పతి ఉదయం కారణంగా సానుకూల ఫలితాలను పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
బృహస్పతి వృషభ రాశిలో ఎనిమిదవ మరియు లాభదాయక గృహానికి అధిపతి. ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో రెండవ ఇంట్లో ఉదయిస్తున్నాడు. బృహస్పతి ఆదాయ వనరుకు సంబంధించి మీకు ఉన్న ఇబ్బందులను తొలగించడానికి దోహదం చేస్తాడు. ఆర్థిక ఇబ్బందులను తొలగించడంతో పాటు, కుటుంబ సమస్యల పరిష్కారానికి కూడా దోహదం చేస్తాడు. ఈ సమయంలో మీరు డబ్బు ఆదా చేసుకుంటారు. వృషభ రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

jupiter rise in gemini gives luck to these zodiac signs from july 9th

మిధున రాశి
మిధున రాశి లోని ఏడవ ఇంటికి అధిపతిగా ఉండటమే కాకుండా కర్మ రాశికి కూడా అధిపతిగా బృహస్పతి ఉంటాడు. జులై 9వ తేదీన మిధున రాశిలో మొదటి ఇంట్లో బృహస్పతి ఉదయిస్తాడు. దీనివల్ల మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకున్న పనులు వేగంగా ముందుకు సాగుతాయి. వైవాహిక జీవితానికి సమయం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలు సంతోషంగా జీవిస్తారు. వ్యక్తిగత జీవితంలోనే కాకుండా కెరీర్లోనే సానుకూల ఫలితాలు వస్తాయి

సింహరాశి
సింహరాశిలో ఐదో మరియు ఎనిమిదవ ఇంటికి బృహస్పతి అధిపతిగా ఉంటాడు. జులై 9వ తేదీన లాభదాయక గృహంలో బృహస్పతి ఉదయిస్తాడు. మిధున రాశిలో బృహస్పతి ఉదయంతో జాతకులు సత్ఫలితాలను పొందుతారు. వీరి ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

తులారాశి
తులారాశిలో మూడవ మరియు ఆరవ ఇంటికి గురువు అధిపతిగా ఉంటాడు. తులారాశిలో గురువు అదృష్ట గృహంలో ఉదయిస్తాడు. బృహస్పతి ఉదయం కారణంగా తులా రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. పిల్లలనుండి శుభవార్తలు వింటారు. పిల్లలు కావాలని ప్రయత్నిస్తున్న వారి కలలు నెరవేరుతాయి శత్రువుల పైన విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి బృహస్పతి ఉదయం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలోని సమస్యలు పరిష్కరించ బడతాయి. తల్లి విషయంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ సమయంలో తొలగిపోతాయి. ఆస్తి విషయంలో సానుకూలమైన ఫలితాలు వస్తాయి. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మతపరమైన యాత్రలు చేసే అవకాశం ఉంది.

కుంభరాశి
కుంభ రాశి వారికి రెండవ మరియు లాభదాయక గృహంలో బృహస్పతి అధిపతిగా ఉంటాడు. బృహస్పతి ఐదవ ఇంట్లో జులై 9వ తేదీన ఉదయిస్తాడు. కాబట్టి ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలను పొందటానికి అనుకూలమైన సమయం.పిల్లల గురించి ఆందోళన చెందుతుంటే ఆందోళన తొలగిపోతుంది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+