వృషభరాశిలో బృహస్పతి ఉదయం.. కేంద్ర త్రికోణ రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారం

వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గమనం రాశులవారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. నేడు వృషభ రాశిలో బృహస్పతి ఉదయించడం వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. వృషభరాశిలో బృహస్పతి ఉదయం ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి బృహస్పతి ఉదయం కారణంగా ఏర్పడుతున్న కేంద్ర త్రికోణ రాజయోగంతో అదృష్టం కలిసివస్తుంది. నిజంగా నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ రాశులు ఏమిటో చూద్దాం.

మేషరాశి
వృషభ రాశిలో బృహస్పతి ఉదయం కారణంగా ఏర్పడే కేంద్ర త్రికోణ యోగంతో మేష రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. గణనీయమైన లాభాలు పొందుతారు. కొత్త ఆదాయ వనరులను ఏర్పరుచుకుంటారు. మీ కోరికలన్నీ నెరవేరే సమయం ఇది.

Jupiter rise in Taurus Kendra Trikona Raja Yoga gives huge benefits and wealth to these zodiac signs

వృషభ రాశి
వృషభ రాశి బృహస్పతి యొక్క ఉదయం వల్ల ఏర్పడే కేంద్ర త్రికోణ రాజ యోగంతో వృషభ రాశి వారికి ఈ సమయంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. వృషభ రాశి జాతకులు ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుతాయి.

మిధున రాశి
వృషభ రాశిలో బృహస్పతి ఉదయం కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో మిధున రాశి జాతకులకు వర్తక వ్యాపారాలలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. వీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. చాలాకాలంగా ఎక్కడైనా వసూలు కానీ డబ్బు ఉంటే అది తిరిగి వస్తుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం.

ధనుస్సు రాశి
కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు కలిసొస్తుంది. దీనివల్ల న్యాయస్థానాలలో కేసులకు సంబంధించిన న్యాయపరమైన విషయాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట మంచి గుర్తింపును పొందుతారు. పనిచేసే చోట పనికి తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. కొత్త ఆస్తులను కూడా కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+