బృహస్పతి అస్తమయంతో ఈ రాశులవారికి కష్టాల సునామీ!
నవగ్రహాలలో ప్రతి గ్రహానికి దేనికదే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నవగ్రహాలలో గురు గ్రహానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గురుగ్రహాన్ని దేవతల గురువుగా చెబుతారు. గురువు జ్ఞానాన్ని అదృష్టాన్ని తీసుకువచ్చే గ్రహంగా చెబుతారు. అటువంటి గురువు జూన్ 11వ తేదీ నుంచి జూలై 7వ తేదీవరకు అస్తమించడు. గురువు అస్తమయం ఐదు రాశులవారికి కొన్ని రోజులపాటు సమస్యలకు కారణంగా. మరి ఆ రాశులేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి గురువు అస్తమయం కష్టాలకు కారణమవుతుంది. ఇంట్లో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో ఏ పని చేసిన ఇబ్బందులు వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయంలో కష్టాలు రావడం పరిపాటిగా మారుతుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గురు అస్తమయంతో కొన్ని సమస్యలు వస్తాయి. మీరు ప్రయాణం చేసేటప్పుడు పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. లేదంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. గురువు అస్తమయం వీరికి ఇబ్బందులు కలుగజేస్తుంది.
వృశ్చిక రాశి
బృహస్పతి అస్తమయంతో వృశ్చిక రాశి వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయి. జీవితంలో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో కాస్త సహాయంతో ప్రవర్తించుట అవసరం.
మకర రాశి
మకర రాశి వారికి బృహస్పతి అస్తమయం 26 రోజులపాటు ఇబ్బందులకు కారణమవుతుంది. మకర రాశి వారు ఈ సమయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురవుతాయి. మకర రాశి వారికి ఈ సమయంలో అపార్ధాలు కొంత మేరకు నష్టం కలిగించే అవకాశం ఉంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి గురువు అస్తమయం అనేక నష్టాలను కష్టాలను కలిగిస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఆలోచించి మాట్లాడడం మంచిది ఇంట్లో ఉన్న వారితో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కుంభ రాశి వారు ఈ సమయంలో అనుకోని ఇబ్బందులలో ఇరుక్కుంటారు. కనుక జాగ్రత్త.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications