నేటినుండి గురు సూర్యుల యుతితో మీరు నక్కతోక తొక్కుతారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గురువు మరియు రవి గ్రహాల కలయిక ఎంతో ముఖ్యమైనది. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారు సానుకూల ఫలితాలను చూస్తారు. 2026 జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో గురు రవి గ్రహాల యుతి కారణంగా లబ్ధిని పొందే రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశిలో ఉద్యోగ స్థానాన్ని రవి గురులు ప్రభావితం చేస్తున్నారు. దీంతో మేషరాశి జాతకులకు రవి గురుల కలయిక కారణంగా ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు, ఉద్యోగాలు లేని వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి జరుగుతుంది.

మిధున రాశి
మిధున రాశి వారికి ధన స్థానంలో రవి మరియు గురుల కలయిక కారణంగా అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి పోటీ పరీక్షలు రాసే వారికి సానుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కెరీర్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది.
కర్కాటక రాశి
భాగ్యాధిపతి గురువు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, ఇన్వెస్ట్ మెంట్ లు కలిసి వస్తాయి.
తులా రాశి
దశమ స్థానంలో గురువు ఉచ్చ స్థితిలో ఉండటం వలన తులారాశి జాతకులకు ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులు మంచి స్థానాలకు చేరుకోవడంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో లాభాలు వస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో భాగ్య స్థానంలో రవి మరియు గురువుల యుతి జరగడంతో ఉద్యోగ, ఆదాయ అవకాశాలు బాగా పెరుగుతాయి. అధికార యోగం వస్తుంది. విదేశీ ఉద్యోగాలు చేసేవారికి బాగుంటుంది. వృత్తిపరంగా మంచి పురోగతి కనిపిస్తుంది.
మీన రాశి
మీనరాశిలో దశమాధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి బాగుంటుంది. విదేశీ అవకాశాలు సులభంగా వస్తాయి. ఆదాయం పెరగడంతోపాటు ఉద్యోగులకు మంచి అవకాశాలు రావచ్చు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications