2025లో ఏనుగు కుంభస్థలాన్ని బద్దలుకొట్టి కోటీశ్వరులయ్యే రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో 2025 సంవత్సరంలో గ్రహాల సంచారం వారి వ్యక్తిగత జీవితాల పైన ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 2025 సంవత్సరంలో ఎంతో శక్తివంతమైన గ్రహంగా భావించే బృహస్పతి గ్రహం మిధునరాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతుంది. కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం దాదాపు 13 నెలల తర్వాత జరుగుతుంది. అక్టోబర్ 18న మిధునరాశి నుండి కర్కాటక రాశిలోకి మారుతుంది.
కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం
కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ సమయంలో బృహస్పతి కటాక్షం కారణంగా ముఖ్యంగా మూడు రాశులవారికి సంపదల వర్షం కురుస్తుంది. సంతోషం వెల్లి విరుస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం.

కర్కాటక రాశి
దేవగురువు బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో నూతన ఆదాయ వనరులు సంపాదించడానికి మార్గాలను కనిపెడతారు. గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బులు సకాలంలో తిరిగి వస్తాయి. పిల్లలనుంచి కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయం వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది.
కన్య రాశి
కన్యా రాశి వారికి బృహస్పతి సంచారం చాలా అద్భుతమైన సంచారంగా ఉంటుంది. ఇది కన్య రాశి వారు శుభవార్తలు వినే సమయం. నూతన ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగాలు వస్తాయి. ఈ సమయంలో భారీగా డబ్బులు సంపాదిస్తారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులు భారీ ఆర్థిక లాభాలను ఇస్తాయి.
తులారాశి
బృహస్పతి సంచారం తులా రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది, తులా రాశిలో బృహస్పతి సంచారం కారణంగా ప్రభుత్వ రంగాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు లాభాలను పొందుతారు. అలాగే వీరికి తండ్రితో అనుబంధం మరింత పెరిగి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తులా రాశి జాతకులు ఈ సమయంలో కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications