రెండు వారాల్లో బుధుడి రాశిలోకి బృహస్పతి.. వీరింట సిరుల పంట!
వేద జ్యోతిషశాస్త్రంలో ప్రతి గ్రహానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. దేవతల గురువైన బృహస్పతికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. జ్ఞానానికి, విద్యకు, ఆధ్యాత్మికతకు, మతతత్వానికి బాధ్యత వహించే గ్రహంగా బృహస్పతిని పరిగణిస్తారు. బృహస్పతి శుభ స్థానంలో ఉన్న వారికి మంచి జరుగుతుంది. అశుభ స్థానంలో ఉంటే చెడు ఫలితాలను చూస్తారు.
బుధుడి రాశిలోకి బృహస్పతి
అటువంటి బృహస్పతి 2025 మే 14వ తేదీన మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు అధిపతిగా ఉన్న మిధున రాశిలోకి గురు సంచారం కొన్ని రాశుల వారికి శుభదాయకంగా ఉంటుంది. బుధుడికి, బృహస్పతికి మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధం వల్ల కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. బృహస్పతి సంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
బృహస్పతి సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు శుభ ఫలితాలు రాబోతున్నాయి. మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగాలలో మంచి పేరును పొందుతారు. పై అధికారుల సహకారం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి జరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో పురోగతికి అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గురు సంచారం కారణంగా శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. ఇది కర్కాటక రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే సమయం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. వీరి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థికంగా ఈ సమయంలో వృశ్చిక రాశి వారు బలోపేతం అవుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి గురు గ్రహ సంచారం కారణంగా కలిసి వస్తుంది. ఈ సమయం ధనుస్సు రాశి జాతకులకు ఏ పని చేసిన విజయాలను అందిస్తుంది. ఆర్థికంగా ఇది మంచి సమయం. వేతనాలు పెరిగే అవకాశం ఉంది. రెండు నెలలపాటు ధనుస్సు రాశి జాతకులు గురువు కారణంగా సుఖంగా బ్రతుకుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications