నవంబర్ 28 నుండి వీరికి కుబేర యోగం కటాక్షించిన బృహస్పతి!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది . దేవతల గురువు అయిన బృహస్పతికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బృహస్పతి ఒక రాశిలో సుమారు ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేస్తాడు. మొత్తం ద్వాదశరాశులలో ప్రయాణించడానికి బృహస్పతికి 12 సంవత్సరాల కాలం పడుతుంది.
రోహిణీ నక్షత్రంలోకి బృహస్పతి
దీంతో బృహస్పతి యొక్క ప్రభావం జాతకుల పైన ఎక్కువ కాలం ఉంటుంది. ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో ఉన్నాడు. అంతేకాదు బృహస్పతి మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అయితే నవంబర్ నెలలో 28వ తేదీన రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం కొనసాగుతుంది. రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది .మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి చక్రాన్ని పాలించే గ్రహం శుక్రుడు. అయితే బృహస్పతి నక్షత్ర మార్పు వృషభ రాశి జాతకులకు చాలా శుభ ప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వీరు తమ జీవితంలోని వివిధ రంగాలలో విజయాలను సాధిస్తారు. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. వృషభరాశి జాతకుల గౌరవ ప్రతిష్టలు ఈ సమయంలో బాగా పెరుగుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
కర్కాటక రాశి
బృహస్పతి నక్షత్రం మార్పు కర్కాటకరాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. కర్కాటక రాశి వారికి ఎప్పటినుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉన్నత విద్యను అభ్యసించాలి అని కోరుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. కర్కాటకరాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారికి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ప్రమోషన్లకు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. తోడబుట్టిన వారి మద్దతు లభిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు బృహస్పతి నక్షత్రం మార్పు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు వివిధ ప్రయోజనాలను పొందుతారు. ఎలాంటి సమస్య అయినా ఇప్పుడు పరిష్కారం అవుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారి సమస్యలు పోయి ఆర్థిక లాభాలు వస్తాయి. ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారికి కూడా కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో వీరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది అన్ని విధాలుగా వృశ్చిక రాశి వారికి శుభ సమయం..
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications