ఈనెల 27వ తేదీ నుంచి ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువు ఉదయించిన రోజు నుంచి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. అయితే కొన్ని రాశులవారు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఆ సమయంలో ఉద్యోగం లేదంటే వ్యాపారంపై ప్రతికూల ప్రభావం ఉండటంతోపాటు డబ్బు నష్టం కూడా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్ 22న దేవగురువైన బృహస్పతి మీనరాశిని విడిచిపెట్టి 27వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. శారీరక ఆనందం, ఐశ్వర్యం, ప్రేమ, అభిమానం, సంతోషం తదితరవాటికి ఇది అనువైన గ్రహం.

వృషభ రాశి
ఈ రాశివారు మరింత జాగ్రత్తగా ఉండక తప్పదు. ఉద్యోగం పోయే ప్రమాదం కనపడుతోంది. డబ్బు నష్టపోతారు. అధికంగా పని ఉండి ఆ భారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

horoscope

కన్యా రాశి
కన్యా రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. డబ్బు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపబోతోంది. దీనివల్ల ప్రస్తుతం చేస్తున్న పనులు కూడా ఆగిపోతాయి. కన్యారాశివారు ఎంతో అప్రమత్తంగా ఉండక తప్పదు.

తులా రాశి
తులా రాశి వారికి ఇది చాలా అశుభమైనది. ఏదైనా ఒక పనిలో విజయం సాధించాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అప్పటికీ విజయం వరిస్తుందని చెప్పలేం. దీన్నిబట్టి ఎంత శ్రమించాలో అర్థమవుతుంటుంది. ఈ కాలంలో ఉపాధి వ్యక్తులు మిశ్రమ ప్రభావాన్ని చవిచూస్తారు. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సరైన నిర్ణయం కాకపోతే నష్టపోక తప్పదు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బృహస్పతి ఉదయించడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు, కుటుంబంతో కూడా చర్చ పెరుగుతుంది. దీని కారణంగా మానసిక ఒత్తిడి వ్యక్తిని చుట్టుముడుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో లాభదాయకమైన సంకేతాలు లేవు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+