కార్తీక అమావాస్య రాబోతోంది.. ఈ ప్రత్యేకమైన పనితో డబ్బు సమస్యలకు చెక్!
హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అమావాస్య ప్రతీనెల కృష్ణపక్షం చతుర్థి తిధి తరువాతి రోజు వస్తుంది. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజుకు చాలా ప్రాధాన్యత ఉంది. అమావాస్య రోజున ఎవరైతే గంగా స్నానాన్ని ఆచరించి శ్రీమహావిష్ణువుని పూజిస్తారో వారికి విశేషమైన ఫలితాలు వస్తాయని చెబుతారు.
అమావాస్యకు చాలా ప్రాధాన్యత
ఇక అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉంటుందని అందుకే అమావాస్య రోజున నది స్నానాన్ని ఆచరించి సాయంత్రం లక్ష్మీదేవిని ఆరాధిస్తారని చెబుతారు. అంతేకాదు అమావాస్యకు మరో ప్రాధాన్యత కూడా ఉంది. పూర్వీకుల అనుగ్రహం పొందాలంటే అమావాస్య తిధి రోజునే వారికి తర్పణాలను ఇచ్చే ఆచారం మనకు అనాదిగా వస్తుంది.

కార్తీక అమావాస్య చాలా స్పెషల్
అయితే ప్రతినెలా వచ్చే అమావాస్యకు ఉండే ప్రాధాన్యత కంటే కార్తీకమాసంలో వచ్చే అమావాస్యకు మరింత ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం కార్తీకమాసంలో డిసెంబర్ ఒకటవ తేదీన అమావాస్య వస్తుంది. డిసెంబర్ ఒకటవ తేదీన అమావాస్య రావడం మతపరంగా విశేషమైన ప్రయోజనాలను కలిగిస్తుంది.
కార్తీక అమావాస్య రోజు ఇలా చెయ్యండి
ఇక కార్తీక అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారో వారికి ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించాలి. కార్తీక అమావాస్య రోజు ఉదయాన్నే నిద్ర లేచి నది స్నానాన్ని ఆచరించి దేవాలయాన్ని సందర్శించాలి. ఆపై లక్ష్మీదేవి పూజలో పాల్గొనాలి.
లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారో వారికి ఆర్ధిక లాభాలు
అయితే కార్తీక అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజలో భాగంగా కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ముఖ్యంగా కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే ఈ రోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారో వారికి కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా డబ్బు పరంగా వస్తున్న అనేక సమస్యలు తొలగిపోతాయి. కనుక కార్తీక అమావాస్య రోజు మరిచిపోకుండా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications