Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కార్తీక పవిత్ర స్నానాలు చెయ్యటానికి శుభ సమయాలు

కార్తీక మాసం రానే వచ్చింది. కార్తీక మాసంలో స్నానానికి, దీపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడు స్నానం చేయడం, కృత్తిక నక్షత్రంలో ఉన్నప్పుడే దీపాలు వెలిగించడం శ్రేష్టమని ఎన్నో శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో పవిత్ర స్నానం చేయడం వల్ల శివ కేశవుల కటాక్షం లభిస్తుందని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి.

అయితే కార్తీక మాసంలో స్నానం ఎప్పుడు చేయాలి? ఈ సంవత్సరం కార్తీకమాసంలో స్నానం చేయడానికి పండితులు సూచిస్తున్న శుభసమయాలు ఏమిటి? ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో స్నానం చేయడానికి నవంబర్ 14వ తేదీ నుండి నవంబర్ 22వ తేదీ వరకు ఉదయం 5 గంటల నుండి 5 గంటల 59 నిమిషాల వరకు విశేష సమయంగా చెప్తున్నారు పండితులు.

Karthika masam 2023: Auspicious timings to do Karthika snanam!!

నవంబర్ 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉదయం నాలుగు గంటల ఒక నిమిషాల నుండి 5 గంటల41 నిమిషాల వరకు విశేష సమయమని సూచిస్తున్నారు. నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ఉదయం నాలుగు గంటల నుండి 5 గంటల వరకు స్నానం చేయడం విశేషంగా పరిగణించబడుతుంది అని చెబుతున్నారు.

ఇక డిసెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు ఉదయం మూడు గంటల 32 నిమిషాల నుండి నాలుగు గంటల 43 నిమిషాల వరకు స్నానం చేయడం విశేషమని చెబుతున్నారు. శివ కేశవులకు అత్యంత ఇష్టమైన కార్తీకమాసంలో పవిత్ర స్నానాలను ఆచరించడం, దీపం పెట్టి పూజలు చేయడం, కార్తీకమాసం నియమాలను పాటించడం, దానధర్మాలు చేయడం ఎంతో మంచిదని చెబుతున్నారు.

బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి పూజ చేస్తే గొప్ప పుణ్య ఫలితం ఉంటుందని, భగవత్ నామస్మరణతో తలస్నానం చేసినట్లయితే మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఆకాశంలో నక్షత్రాలు ఉన్న సమయంలోనే స్నానం చేయాలని, ఆ సమయంలో నీరు ఔషధ గుణాలతో నిండి ఉంటుందని సూచిస్తున్నారు.

ప్రవహించే నది లోను, ఏదైనా సరస్సులోనూ స్నానం చేస్తే మంచి ఫలితం వస్తుందని చెబుతున్నారు. ఆరోగ్యం సహకరించిన వారు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయొచ్చని, అయితే ఈ మాసంలో భక్తి మాత్రమే ప్రాధాన్యమని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+