Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అద్భుత యోగాల కార్తీక పౌర్ణమి.. వీరికి మొదలైంది సంపదల సునామి!

హిందువులంతా చాలా ప్రత్యేకంగా భావించే కార్తీక మాసంలో నవంబర్ 15వ తేదీన అంటే నేడు కార్తీక పౌర్ణమి జరుపుకుంటున్నాం కార్తీక మాసం చాలా ప్రత్యేకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కార్తీక పౌర్ణమి నాడు అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఈసారి కార్తీక పౌర్ణమి సమయంలో శశ రాజయోగం ఏర్పడుతుంది. శశ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది .ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి కార్తీక పూర్ణిమ లబ్ది చేస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి శుభయోగాల కారణంగా అభివృద్ధికి ద్వారం తెరుచుకుంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సంతోషకరమైన రోజులు వస్తాయి. మేషరాశి జాతకులు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. దుఃఖం తొలగిపోతుంది. మీకు మంచి స్నేహితులు దొరుకుతారు. అసంపూర్తి పనులు ఈ సమయంలో విజయవంతమవుతాయి. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. చాలా డబ్బు వస్తుంది.

Karthika Pournami 2024 these zodiac signs will get huge wealth and happiness from november 15th

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కార్తీక పౌర్ణమి వేళ విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి కర్కాటక రాశి వారి జీవితంలో కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ఓర్పు. సహనంతో పని చేసే వారికి జీవితంలో పురోగతి సాధ్యమవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. జీవితంలో కర్కాటక రాశి జాతకులు మధురానుభూతులను పొందుతారు.

సింహరాశి
సింహ రాశి వారికి కార్తీక పౌర్ణమి సంతోషాన్ని కలిగిస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో కొత్త శుభ కార్యాలు ప్రారంభించగలరు. మీరు పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో చాలా లాభాలు వస్తాయి. కార్తీక పౌర్ణమి నుండి సింహరాశి జాతకుల జీవితం అద్భుతంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. ఇంట్లో శాంతి ఉంటుంది.

తులారాశి
తులారాశి వారికి కార్తీక పౌర్ణమి నుండి చాలా ఫలవంతంగా ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. మీరు తల్లిదండ్రుల సహాయం పొందుతారు. ఆర్ధికంగా బాగుంటుంది. తులారాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది . నిలిచిపోయిన పనులు ఈ సమయంలో విజయవంతం అవుతుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కార్తీక పౌర్ణమి కలిసొస్తుంది. ఇది వీరికి అదృష్ట సమయం. ఈ సమయంలో మీరు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. విష్ణువు ఆశీస్సులతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. విఫలమైన పని కూడా ఈ సమయంలో మళ్ళీ ప్రయత్నం చేస్తే విజయవంతమవుతుంది.

కుంభరాశి
కుంభ రాశి వారికి కార్తీక పౌర్ణమి నుండి అదృష్టం కలిసి వస్తుంది. మీరు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అనారోగ్యం నుండి బయట పడతారు. వ్యాపార ఒప్పందాలు మంచి ఫలితాలను ఇస్తాయి . వర్తక వ్యాపారాలు చేసే వారికి శుభ దాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి కూడా పురోగతి ఉంటుంది. ఇది నిజంగా శుభ సమయం.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+