Karthika Pournami 2024.. ఈ రాశుల జీవితంలో సంపదల సునామీ ప్రకటించిన కార్తీక పౌర్ణమి!
హిందువులంతా చాలా ప్రత్యేకంగా భావించే కార్తీక మాసం ప్రస్తుతం కొనసాగుతుంది . కార్తీక పూర్ణిమ కూడా వస్తోంది. నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి జరుపుకోవటానికి ప్రజలంతా సిద్ధమవుతున్నారు. హిందువుల నమ్మకం ప్రకారం ఈ మాసం శివునికి, విష్ణువుకు చాలా ఇష్టమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల పౌర్ణమి నాడు శ్రీమహావిష్ణువు ఆశీస్సులతో ఈ 5 రాశుల వారి జీవితంలో అదృష్టాన్ని కురిపిస్తారు.
మేషరాశి
మేష రాశి వారికి కార్తీక పూర్ణిమ చాలా శుభప్రదంగా చెప్పబడింది. ఈ కార్తీక పౌర్ణమి నాటి నుండి వారికి సంతోషకరమైన రోజులు వస్తాయి. మేషరాశి జాతకులు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. దుఃఖం తొలగిపోతుంది. మీకు మంచి స్నేహితులు దొరుకుతారు. అసంపూర్తి పనులు ఈ సమయంలో విజయవంతమవుతాయి. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. చాలా డబ్బు వస్తుంది. అభివృద్ధికి ద్వారం తెరుచుకుంటుంది.ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

సింహరాశి
కార్తీక పౌర్ణమి సింహ రాశి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో కొత్త శుభ కార్యాలు ప్రారంభించగలరు. మీరు పనిలో విజయం సాధిస్తారు. కార్తీక పౌర్ణమి నుండి సింహరాశి జాతకుల జీవితం అద్భుతంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. ఇంట్లో శాంతి ఉంటుంది. వ్యాపారంలో చాలా లాభాలు వస్తాయి.
తులారాశి
తులారాశి వారికి కార్తీక పౌర్ణమి నుండి చాలా ఫలవంతంగా ఉంటుంది. తులారాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది . నిలిచిపోయిన పనులు ఈ సమయంలో విజయవంతం అవుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. మీరు తల్లిదండ్రుల సహాయం పొందుతారు. ఆర్ధికంగా ఫలవంతంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కార్తీక పౌర్ణమి కొత్త ఆశలు తెస్తుంది. ఈ సమయంలో మీరు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. విష్ణువు ఆశీస్సులతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. విఫలమైన పని కూడా ఈ సమయంలో మళ్ళీ ప్రయత్నం చేస్తే విజయవంతమవుతుంది. ఇది వీరికి అదృష్ట సమయం.
కుంభరాశి
కుంభ రాశి వారికి కార్తీక పౌర్ణమి నుండి అదృష్టం కలిసి వస్తుంది. వారికి కార్తీక పూర్ణిమ నాడు శ్రీమహావిష్ణువు ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. మీరు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అనారోగ్యం నుండి బయట పడతారు. వ్యాపార ఒప్పందాలు మంచి ఫలితాలను ఇస్తాయి . వర్తక వ్యాపారాలు చేసే వారికి శుభ దాయకంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications