కార్తీక లాభ పంచమి.. నేడు ఇవి ఇంటికి తెచ్చుకుంటే ధనలక్ష్మీ కటాక్షం!
హిందూమత విశ్వాసాల ప్రకారం కార్తీకమాసానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కార్తీకమాసంలో ప్రతిరోజు దేనికదే విశేషమైనది. నిన్న కార్తీక మాసంలో నాగుల చవితి పండుగను ప్రజలందరూ విశేషంగా జరుపుకోగా, నేడు కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని ఐదవ రోజైన లాభ పంచమి కూడా జరుపుకుంటున్నారు.
లాభ పంచమి... ఈ వస్తువులు తెచ్చుకోండి
కార్తీక లాభ పంచమి నేడు జరుపుకుంటున్న క్రమంలో ఈరోజు లక్ష్మీదేవి కటాక్షం కోసం కొన్ని పనులు చేస్తే మంచిదని చెబుతున్నారు. కొన్ని వస్తువులను ఇంటికి తీసుకొచ్చుకుంటే ఇంట్లో సంతోషం మరియు శ్రేయస్సు పెరుగుతుందని, ఆ ప్రత్యేక వస్తువులను గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

లాభ పంచమి నాడు లక్ష్మీ కటాక్షం కోసం ఇది తెచ్చుకోండి
కార్తీక లాభ పంచమినాడు శ్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. శ్రీ యంత్రాన్ని పంచామృతంతో గంగాజలంతోను శుభ్రం చేసి ఇంటికి దక్షిణ దిశలో ఎరుపు రంగు వస్త్రం పైన పెట్టి పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం వారిపై తప్పకుండా ఉంటుంది. ఇక కార్తీక లాభ పంచమినాడు ఇంట్లో లక్ష్మీదేవి తో పాటుగా కుబేరుడు విగ్రహాన్ని తెచ్చి పెట్టుకుంటే శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఈ మూడు విగ్రహాలు, చిత్రాలు తెచ్చి పెట్టుకుంటే సంతోషం
కుబేరుడు ఐశ్వర్యాన్ని మరియు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు కావడంతో కుబేరుడు విగ్రహాన్ని తెచ్చుకుంటే మంచిది. ఇక లక్ష్మీ దేవి, కుబేరుడు చిత్రంతో పాటు ఇంట్లో స్వస్తిక్ చిహ్నం ఉండేలా చూసుకోవాలి. కుబేరుడు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో అనారోగ్యానికి పేదరికానికి తావు ఉండదు.
ఈ మొక్క ఇంటికి తెచ్చుకోండి చాలు
కార్తీక లాభపంచమి నాడు పారిజాత మొక్కను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సముద్ర మథనం నుండి ఉద్భవించిన 14రత్నాలలో పారిజాతం ఒకటి . ఈ పారిజాత వృక్షాన్ని స్వర్గంలో ఇంద్రుడు స్వయంగా పెట్టాడని, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వృక్షమని చెబుతారు. ఇక అటువంటి వృక్షం మనందరికీ కూడా వరం. కాబట్టి ఎవరైతే లాభపంచమి నాడు పారిజాత మొక్క ఇంటికి తెచ్చి పెట్టుకుంటారో.. వారి ఇంట్లో సంతోషం, శ్రేయస్సు ఉంటాయని చెబుతున్నారు.
లాభ పంచమి నాడు ఇది కూడా ట్రై చెయ్యండి
ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో శంఖాన్ని ఒకటిగా చెబుతారు. క్షీర సాగరాన్ని మధించినప్పుడు లభించిన 14 రత్నాలలో శంఖం కూడా ఒకటి. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా సంపదలకు ఎటువంటి లోటు ఉండదని, లాభ పంచమినాడు దీనిని ఇంటికి తెచ్చుకుంటే శుభాలు జరుగుతాయని చెబుతున్నారు. నేడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే వీటిల్లో ఏదైనా ఒకదానిని ఇంటికి తెచ్చుకోండి
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications