కేంద్ర త్రికోణ రాజయోగం: జూన్ లో ఈ రాశులవాళ్ళు నక్క తోక తొక్కినట్టే!!
శని నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం. నవగ్రహాల కదలికలు మన జీవితాలను శాసిస్తాయి. ఇక అందులో ముఖ్యమైన శని రాశిచక్రాన్ని మార్చినప్పుడు మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో అనేకమైన ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. జూన్ లో శని రాశిచక్రాన్ని మారుస్తుంది. కుంభ రాశిలోకి శని తిరోగమనం అవుతుంది. అయితే దీనివల్ల కొన్ని రాశుల వారికి నష్టం జరిగితే మరికొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది.
శని కుంభ రాశి లోకి తిరోగమనం కావడంవల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. జూన్ 17 వ తేదీన రాత్రి 10 గంటల 48 నిముషాలకు కుంభ రాశిలో శని తిరోగమనం చెందడంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. కేంద్ర త్రికోణ రాజయోగం అనేది ఒక శుభయోగం. ఈ యోగం ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి విజయం, సంపద, శక్తి, కీర్తి లభిస్తాయి.

ఇక జూన్ మాసంలో కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల 5రాశుల వారి జీవితాల్లో అదృష్టం తాండవిస్తుంది. వారు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్టే అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి మేషరాశి, వృషభరాశి, మిధునరాశి, సింహరాశి, మకరరాశి జాతకులు కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల లబ్ధి పొందుతారు.
కేంద్ర త్రికోణ రాజయోగం మేష రాశి వారికి డబ్బు కష్టాలను తీరుస్తుంది. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా వ్యాపారాన్ని నిర్వహిస్తే, అది ఆర్థిక ప్రయోజనాలను కూడా తెస్తుంది. మిధున రాశి జాతకులకు కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. జీవితంలో ఏ రంగంలో ఉన్న వారైనా ఉన్నతిని చూడటానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక విజయాలు సాధించే సూచనలు ఉన్నాయి.
కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల వృషభ రాశి జాతకులు జీవితాలలో అనేక ముఖ్యమైన మార్పులు వస్తాయి. ఈ జాతకులకు మంచి నచ్చిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఏవైనా కొత్త పనులు ప్రారంభించే సూచనలు ఉన్నాయి. ఏ పని చేసినా ఈ సమయంలో కలిసొస్తుంది. కేంద్ర త్రికోణ రాజయోగం సింహ రాశి జాతకులకు ఆర్థిక లాభాలను అందిస్తుంది. ఆగిపోయిన పనులు మళ్లీ పూర్తి చేసుకోగలుగుతారు.
ఏదైనా బిజినెస్ డీల్ చేసుకోవాలనుకుంటే సింహ రాశి జాతకులకు ఇదే సరైన సమయం. కేంద్ర త్రికోణ రాజయోగం మకరరాశి జాతకుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది. వివిధ వనరుల నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సంతోషంగానూ, శ్రేయస్సు తోనూ జీవించే అవకాశం ఉంటుంది. సంపదను నిలుపుకోవడానికి కూడా ఇది మంచి సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications