శని తిరోగమనంతో కేంద్ర త్రికోణ రాజయోగం... మూడు రాశులవారికి అఖండ ధనయోగం
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గ్రహాలన్నింటిలో శని ఒక ముఖ్యమైన గ్రహంగా చెప్పొచ్చు. జూన్ 29వ తేదీ రాత్రి 11 గంటల 40 నిమిషాలకు శని కుంభ రాశిలో శని తిరోగమనం చెందుతుంది. కుంభ రాశిలో శని తిరోగమనం ఫలితంగా కొన్ని రాశుల వారికి కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. కేంద్ర త్రికోణ రాజయోగం ఏంటి, దానివలన కలిగే ఫలితాలేంటి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది ఇలా
జాతకంలో మొదటి, నాల్గవ, ఏడవ, పదవ గృహాలను కేంద్రంగా పిలుస్తారు. 5, 9వ గృహాలను త్రికోణం అంటారు. కేంద్ర గృహాలు విష్ణువు చే, త్రికోణ గృహాలు లక్ష్మిచే పాలించబడతాయి. శని తిరోగమనం కారణంగా ఈ కేంద్ర మరియు త్రికోణ గృహాల మధ్య సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది.ఈ రాజయోగం వలన మూడు రాశులకు అఖండ ధనయోగం కలుగుతుంది.

కుంభరాశి
కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులకు లబ్ది జరుగుతుంది. ఇప్పటినుంచి కుంభ రాశి వారికి మంచి రోజులు మొదలయ్యాయి అని చెప్పవచ్చు . వీరి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అన్ని రంగాలలోనూ పురోగతిని, విజయాన్ని సాధిస్తారు. ఈ రాజ యోగం కారణంగా కుంభరాశి జాతకుల ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వచ్చే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం కచ్చితంగా లభిస్తుంది.
మిధున రాశి
కేంద్ర త్రికోణ రాజయోగం మిధున రాశి లోను ఏర్పడుతుంది. మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక లాభాలను పొందుతారు. పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న విద్యార్థులు రాణిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు అన్ని పూర్తి అవుతాయి. ఈ సమయంలో మిధున రాశి జాతకుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిధున రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు.
వృషభ రాశి
కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల వృషభ రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు వృత్తిలో విజయాలు సాధిస్తారు. వ్యాపారవేత్తలకు గణనీయమైన లాభాలు వస్తాయి. వృషభ రాశి వారు చేసే ప్లాన్లు ఏవైనా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగం దొరుకుతుంది. ఈ సమయం అన్ని విధాల కలిసొస్తుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications