నవంబర్ 10వరకు వీరికి సంపదల వర్షం అనుగ్రహించిన కేతువు!
సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల రవాణాతో పాటుగా నీడ గ్రహాలుగా చెప్పబడే రాహు కేతువుల సంచారం కూడా అన్ని రాశులవారి పైన ప్రభావం చూపిస్తుంది. సెప్టెంబర్ మాసంలో కేతువు హస్తా నక్షత్రంలో మొదటి పాదంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 9వ తేదీన కేతువు నక్షత్ర సంచారం హస్తా నక్షత్రంలోని మొదటి దశలోకి ప్రయాణమై నవంబర్ పదవ తేదీ వరకు ఇక్కడ సంచరించి ఆ తర్వాత ఉత్తర ఫాల్గుణి నక్షత్రం లోకి ప్రవేశిస్తుంది.
కేతువు అనుగ్రహించే రాశులు
ఈ కేతువు నక్షత్ర సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ముఖ్యంగా మూడు రాశుల వారికి మాత్రం కేతువు నక్షత్ర సంచారం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. మరి కేతువు అనుగ్రహించే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
హస్తా నక్షత్రంలోకి కేతువు సంచారం కారణంగా కర్కాటకరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కర్కాటకరాశి జాతకులు ఏ పని చేసినా విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో ఆర్థికంగా లాభపడతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి బాగుంటుంది. నూతన ఆదాయ వనరులను పొందడానికి మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది.
ధనుస్సు రాశి
కేతువు హస్తా నక్షత్ర సంచారం ధనుస్సు రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ధనుస్సు రాశి జాతకుల వ్యాపారాలు ఈ సమయంలో పుంజుకునే అవకాశం ఉంది. కొత్త వ్యాపార భాగస్వాములను కనుగొనడం ద్వారా వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలను కనుగొంటారు. ఉద్యోగస్తుల ఆదాయంలోను పెరుగుదల కనిపిస్తుంది. ఆస్తుల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు.
కుంభరాశి
హస్తా నక్షత్రం లోకి కేతువు సంచారం కారణంగా కుంభ రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. కుంభ రాశి జాతకులకు ఈ సమయం ఉద్యోగం ప్రశాంతంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని మద్దతు లభిస్తుంది. పెద్ద పెద్ద ప్రభుత్వ ప్రాజెక్టులను పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర మద్దతు పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications