హస్త నక్షత్రం, కన్యా రాశిలో కేతువు: ఈ రాశులవారికి ధనలాభం!!

మార్చి 4, 2024న, నీడ గ్రహం అయిన కేతువు హస్తా నక్షత్రంలోకి ప్రవేశించి నవంబర్ 10, 2024 వరకు హస్తా నక్షత్రంలోనే ఉంటుంది. అంతేకాదు అక్టోబర్ 30, 2023 న కేతువు కన్య రాశిలోకి ప్రవేశించి, మే 18, 2025 వరకు ఇక్కడే ఉంటుంది. కన్యా రాశిలో కేతువు సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, కొన్ని రాశులవారికి అశుభ ఫలితాలను ఇస్తుంది.

సహజంగా కేతువును అశుభాలను ఇచ్చే నీడ గ్రహంగా చూస్తారు. కానీ కేతువు కొన్ని రాశుల వారికి శుభాలను కూడా చేకూరుస్తుంది. కేతు గ్రహం కారణంగా మేష రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి వారికి శుభాలు చేకూరుతాయి. వీరికి కన్యారాశిలో కేతు సంచారం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

Ketu in Virgo and Hasta Nakshatra Money gain for these zodiac signs

మేషరాశి
మేష రాశి వారికి కన్యారాశిలో కేతు సంచారం లబ్ధిని చేకూరుస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. మీ ఆర్థిక దృక్పథం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు వ్యక్తిగత వృత్తిపరమైన రంగాలలో స్థిరత్వం కనిపిస్తుంది. మేష రాశి వారి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి వ్యూహరచన చేయడానికి ఇది సరైన సమయం. కేతు సంచార సమయంలో కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని మేష రాశి వారు గడుపుతారు.

వృశ్చిక రాశి
కన్యారాశిలో కేతు సంచారం వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి జాతకుల వ్యాపార ప్రయత్నాలకు సానుకూల స్పందనలు వస్తాయి. ఈ సమయంలో చేసుకునే వ్యాపార ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో ఉత్పాదకత కూడా పెరుగుతుంది. ఈ సమయంలో ఆర్థిక లాభాలకు ఎక్కువ ఛాన్స్ ఉంది. అయితే అనవసరమైన ఖర్చుల పట్ల జాగ్రత్త. ఆరోగ్యానికి ప్రాధాన్యత నివ్వాలి. ఇక శ్రేయస్సు కోసం ఒత్తిడి లేని జీవన శైలిని నిర్వహించాలి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కేతు సంచారం శుభాలను తెస్తుంది. కర్కాటక రాశి జాతకులకు కొత్త వెంచర్ల ను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. తోడబుట్టిన వారితో సంబంధాలు ఈ సమయంలో మెరుగుపడతాయి. దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులకు ఈ సమయంలో పరిష్కారం దొరుకుతుంది. కేతు సంచార సమయంలో మీ బంధాలను బలోపేతం చేయడానికి కుటుంబ సభ్యులతో సమయం గడపాలని సూచించబడింది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+