కేతువుతో వీరికి కింగ్ సైజ్ లైఫ్.. మీరున్నారా!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను నిర్ణయిస్తాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో కీడు గ్రహంగా చెడు చేసే గ్రహంగా చెప్పుకునే కేతువు సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. కేతువు జాతకంలో ఉన్న స్థానాన్ని బట్టి ఆయా రాశుల వారి జీవితం పైన ప్రభావం పడుతుంది.
కేతువుకు ఇష్టమైన రాశులు
కేతువును భౌతిక వస్తువులకు, ఆధ్యాత్మికతకు, విలాసాలకు ప్రతీకగా చెబుతారు. అటువంటి కేతు గ్రహం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తాడు. ఈ రాశుల పైన కేతువు యొక్క ప్రేమ ఉంటుంది. మరి కేతువు కారణంగా అదృష్టవంతులు అయ్యే రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశిలో జన్మించిన వారికి కేతువు అనుగ్రహం ఉంటుంది. ఈ గ్రహ ప్రభావంతో మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కేతువు అనుగ్రహం వల్ల వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కేతు అనుగ్రహం లభిస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఎప్పటినుంచో పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇప్పుడు ఏ పని చేసినా సమస్యలు రాకుండా సానుకూలంగా జరుగుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది .ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ఇల్లు, వాహనాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి
కేతువు అనుగ్రహం కారణంగా వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు సానుకూల ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది. ఉద్యోగాలు చేసేవారు సానుకూల ఫలితాలను చూస్తారు. ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. కష్టపడి పనిచేసే వారు అద్భుతమైన ఫలితాలను చూస్తారు.
కన్యారాశి
కన్య రాశి వారిపై కేతు అనుగ్రహం ఉంటుంది. కన్యారాశి జాతకులు ఏ రంగంలో పనిచేసిన విజయాలను సాధిస్తారు . ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పేదరికం పోతుంది. భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి సానుకూల ఫలితాలను ఇచ్చే కాలం.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications