వీరికి ధనపు రాశులను ఇవ్వకుండా వదలనన్న కేతువు!
వేద జ్యోతిష్యశాస్త్రంలో నీడ గ్రహం, కీడు గ్రహంగా చెప్పుకునే కేతువు సంచారం కొన్ని రాశులవారికి శుభాలను తెస్తుంది. గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మాత్రమే కాదు, ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి కూడా ప్రయాణం చేస్తాయి. ప్రస్తుతం కేతువు హస్తా నక్షత్రంలో ఉన్నాడు. 2025 జూలై 21 వరకు కేతువు హస్తా నక్షత్రంలోనే సంచారం చేస్తాడు. కేతువు నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
కేతువు హస్తా నక్షత్ర సంచారం
ప్రస్తుతం కేతువు హస్తా నక్షత్రం రెండవ దశలోకి సంచారం చేయబోతుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తుంటే, మరికొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. కేతువు హస్తా నక్షత్ర సంచారం కారణంగా లబ్ధి పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
కేతువు హస్తా నక్షత్ర సంచారం కారణంగా మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ సమయంలో సానుకూల ఫలితాలు పొందుతారు. హస్తా నక్షత్రంలోకి సంచారం కారణంగా కెరీర్ కు సంబంధించి జీవితంలో ఊహించని విజయాలను సాధిస్తారు. ఈ నక్షత్ర సంచారం మేష రాశి వారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీరు ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.
మిధున రాశి
హస్తా నక్షత్రంలో కేతువు సంచారం కారణంగా మిధున రాశి వారికి లబ్ధి జరుగుతుంది. మిధున రాశి జాతకులు కొత్త ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మతపరమైన విషయాల పైన ఆసక్తి పెరుగుతుంది. మిధున రాశి వారు శరీరం పైన శ్రద్ధ వహించడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి. మానసిక ఆనందం మెరుగుపడుతుంది. ఒత్తిడి కూడా విపరీతంగా తగ్గుతుంది.
మకర రాశి
కేతువు హస్తా నక్షత్రంలో సంచరించడం వల్ల మకర రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మకర రాశి వారి జీవితంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో భారీ లాభాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను సమకూరుస్తాయి. మకర రాశి విద్యార్థులకు ఈ సమయం విద్యకు సంబంధించి అనుకూలమైన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications