మూడురోజుల్లో మీకు అఖండ ధనయోగం సిద్ధి.. మాటిచ్చిన కేతువు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతువులను పాప గ్రహాలుగా చెబుతారు. నవగ్రహాలలో కేతువును చెడు చేసే గ్రహంగాను, క్రూర గ్రహంగాను పరిగణిస్తారు. జాతకంలో కేతువు సంచారం జరిగితే అశుభాలు జరుగుతాయని చాలామంది నమ్ముతారు. అయితే వివిధ జాతకుల జీవితాలలో కేతువు శుభాలను కూడా చేకూరుస్తాడు.
సింహరాశిలో కేతువు
మే 18వ తేదీన కేతువు సింహరాశిలోకి సంచారం చేయనున్నాడు. శని మాదిరిగానే కేతువు కూడా నిదానంగా సంచరించే నీడ గ్రహం. సింహరాశిలో కేతువు సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం. కేతువు సంచారం కారణంగా వృషభరాశి, తులా రాశి, కర్కాటక రాశి జాతకులు అదృష్ట జాతకులు కాబోతున్నారు.

వృషభ రాశి
మే 18వ తేదీన కేతువు రాశి మార్పు వృషభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కేతువు సింహరాశిలోకి సంచరించే సమయం వృషభ రాశి జాతకులకు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో అన్ని విధాలా లబ్ధి పొందుతారు. నూతన వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. వీరికి ఈ సమయంలో కెరీర్ లో పురోగతి ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
తులారాశి
సింహరాశిలో కేతు సంచారం తులా రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో భారీగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి . కెరీర్లో పురోగతి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ స్కీముల నుండి, ఇన్వెస్ట్మెంట్ ల నుండి లాభాలు వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వీరు అనుకున్న పనులు ఈ సమయంలో తప్పక పూర్తవుతాయి. తులా రాశి జాతకులకు విజయం లభిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు కేతువు రాశి మార్పు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా విజయాలను సాధిస్తారు. కర్కాటక రాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. వచ్చే ఏడాదిన్నర కాలం ఆర్థిక లాభంతో పాటు, ఉద్యోగంలో పురోగతిని చూస్తారు. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వర్తక, వ్యాపారాలలో లాభాలు వస్తాయి.ఇది వీరికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications