మే నెలలో వీరికి ధనపు రాశులను మోసుకొస్తానని మాటిచ్చిన కేతువు
వేద జ్యోతిషశాస్త్రంలో రాహు, కేతువులను చెడు చేసే గ్రహాలుగా, కీడు గ్రహాలుగా, క్రూరమైన వాటిగా పరిగణిస్తారు. రాహు, కేతువులు శని మాదిరిగానే చాలా నిదానంగా కదిలేటువంటి గ్రహాలు. రాహు కేతువులు రెండు తిరోగమన దిశలో సంచారం చేస్తాయి. ఇవి 18 నెలల తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తాయి.
మే నెలలో కేతువు సంచారం
మే 18వ తేదీన కేతువు తన రాశి చక్రాన్ని మార్చుకుంటుంది. మే 18వ తేదీన నాలుగు గంటల 30 నిమిషాలకు కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తుంది. సూర్యుడి రాశిచక్ర మైన సింహరాశిలోకి కేతువు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు ఏ పని చేసిన మంచి ప్రయోజనాలను పొందుతారు.

మేషరాశి
మేష రాశి వారికి కేతువు సంచారం కలిసి వస్తుంది. మేష రాశి వారు ఈ సమయంలో సృజనాత్మకంగా ఉంటారు. చదువు విషయంలోను, ప్రేమ జీవితంలోను పురోగతిని చూస్తారు. మేషరాశి వారు ఈ సమయంలో మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు . కేతు సంచారం మేష రాశి వారికి అన్ని విధాల మేలు చేస్తుంది.
కన్యారాశి
కన్యా రాశి వారికి కేతు సంచారం కలిసి వస్తుంది. కేతువు కన్యారాశిలో 12వ ఇంట్లో సంచారం చేయడం వల్ల మీరు మనశ్శాంతిగా జీవిస్తారు. ధ్యానం, యోగ లేదా ఆధ్యాత్మిక సాధన చేయడం వల్ల మానసిక బలాన్ని పొందుతారు. ఈ సమయంలో కన్యా రాశి వారి ఖర్చులు అదుపులో ఉంటాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.
తులారాశి
తులా రాశి జాతకులకు కేతు సంచారం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. తులారాశి వారు సోషల్ నెట్వర్క్ నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఊహించని వ్యక్తులు మీ జీవితంలో పెద్ద అవకాశాలను ఇస్తారు. ఇక సోషల్ మీడియా లేదా డిజిటల్ ప్లాట్ ఫామ్ ల నుండి డబ్బు సంపాదించడానికి అవకాశాలు పెరుగుతాయి. జీవితంలో మీ ఎదుగుదలకు ఉపయోగపడే కొంతమంది వ్యక్తులను మీరు కలుస్తారు.
ధనుస్సురాశి
కేతు సంచారం ధనుస్సు రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ధనుస్సు రాశి వారు విదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీరు కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరిశోధన విద్యార్థులకు, విద్యార్థులకు కూడా ఇది స్వర్ణ కాలంగా చెప్పవచ్చు.
కుంభరాశి
కేతు సంచారం కుంభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు మీ బంధాలను లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. వ్యాపార భాగస్వామ్యంలో వృత్తిపరమైన సరిహద్దులను నిర్ణయించడం అవసరం. ఈ సమయంలో మీ సంబంధాలను మూల్యాంకనం చేసుకుంటారు. మీరు సరైన దాన్ని ఎంపిక చేసుకొని ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సానుకూల పరిణామం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications