త్వరలోనే ఈ రాశులవారు పులిపంజా చీల్చి కుబేరులవుతారన్న కేతువు!
మే 18వ తేదీన కేతువు సూర్యుడి రాశిగా చెప్పే సింహరాశిలోకి సంచారం చేస్తున్న కారణంగా కొన్ని రాశుల వారికి చాలా విశేషమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా నీడ గ్రహంగా, కీడు గ్రహంగా భావించే కేతు గ్రహం అన్ని రాశుల వారి పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని భావిస్తారు. అయితే ఒక్కొక్కసారి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు కేతు గ్రహం సానుకూల ఫలితాలను కూడా ఇస్తుంది.
మే నెలలో కేతువు సంచారం
కేతు గ్రహం మే 18 వ తేదీన కన్యారాశిలో తన తిరోగమన సంచారాన్ని ప్రారంభిస్తుంది. ఇక కేతు గ్రహం కారణంగా కొన్ని రాశుల వారు బోలెడు ఆర్ధిక ప్రయోజనాలను పొందబోతున్నారు. అదృష్టవంతులయ్యే ఆ రాశుల వారు ఎవరో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మీనరాశి
కేతు గ్రహం సింహరాశి లోకి ప్రవేశించటం కారణంగా మీన రాశి వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా మీన రాశి వారు లాభపడతారు. ఈ సమయంలో ఊహించని విధంగా వీరికి డబ్బు వచ్చి పడుతుంది. ఎటువంటి పనులనైనా చక్కబెట్టగలిగే సామర్థ్యం ధైర్యం మీన రాశి వారికి ఉన్నాయి.
మిధున రాశి
మే 18వ తేదీ నుంచి మిధున రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. మే నెల నుంచి వీరి జీవితం చాలా బాగుంటుంది. మిధున రాశి వారు అనుకున్న పనులన్నీ చక చకా జరిగిపోతాయి. ఈ సమయంలో వీరి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయంలో వీరు చాలా ధైర్యవంతంగా ఉండి అన్ని పనులను చక్కబెడతారు.
వృశ్చిక రాశి
కేతు గ్రహ సంచారం కారణంగా వృశ్చిక రాశి వారు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి అదృష్టం రెట్టింపు అవుతుంది. కీర్తి ప్రతిష్టల విషయంలో సంతోషం ఉంటుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోరిక ఈ సమయంలో తీరుతుంది. ఇది వృశ్చిక రాశి వారికి శుభ సమయం.
ధనుస్సు రాశి
కేతు గ్రహ సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఆర్థిక విషయాలలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఇది ధనుస్సు రాశి వారికి శుభ సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications