Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆగస్ట్ లో వీరికి కష్టాల సునామీ కన్ఫర్మ్ చేసిన ఖప్పరయోగం

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు నిరంతరం మారుతూ ఉండటం వల్ల జ్యోతిష్యశాస్త్రంలో శుభ మరియు అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. ఖప్పర యోగం ఒక అశుభ యోగంగా పరిగణించబడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. శ్రావణమాసంలో ఏర్పడుతున్న ఈ ఖప్పర యోగం కొన్ని రాశుల వారికి ప్రతికూలతలను ఇస్తుంది.

శక్తివంతమైన గ్రహాలు అగ్ని తత్వ రాశులను ప్రభావితం చేస్తే ఖప్పర యోగం

శ్రావణమాసంలో కుజుడు సింహరాశిలో ఆగష్టు 13న ప్రవేశించడం వల్ల ఖప్పర యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి సమస్యలను తెస్తుంది. సూర్యుడు, కుజుడు వంటి శక్తివంతమైన గ్రహాలు అగ్ని తత్వ రాశులను ప్రభావితం చేసినప్పుడు, కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Khappara Yogam on august 13th Its Effects On Zodiac Signs

ఖప్పర యోగంతో ప్రతికూల ఫలితాలు పొందే రాశులు

ఈ సమయంలో కొన్ని రాశుల వారికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఖప్పర యోగం వల్ల ముఖ్యంగా 4 రాశులు ప్రతికూల ఫలితాలను పొందుతున్నాయి

మిధున రాశి

మిథున రాశి వారికి ఖప్పర యోగం కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ యోగం వల్ల ఒత్తిడి అధికమవుతుంది. ఈ రాశి వారు తమ మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల సంబంధాలలో సమస్యలు తలెత్తవచ్చు, అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా రావచ్చు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఖప్పర యోగం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఆస్తి సంబంధిత విషయాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఇది వృశ్చిక రాశి వారికి నష్టాలను, కష్టాలను కలిగించే సమయం.

కన్యారాశి

కన్యా రాశి వారికి ఖప్పర యోగం కష్టాలను కలిగిస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కన్య రాశి వారికి కెరీర్ పరంగా సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్లకు ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఖప్పర యోగం కారణంగా ఇబ్బందులు వస్తాయి. ఈ సమయంలో మీన రాశి వారి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మీన రాశి వారి ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది. నిద్రలేమి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీన రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+