today rashiphalalu: ఈరోజు మీ జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయన్న గురు, శుక్రులు
ఈరోజు మే 23 2026 శనివారం గ్రహ సంచారాలు ద్వాదశ రాశులవారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనున్నాయి. సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తుండగా, చంద్రుడు సింహ రాశి నుంచి కన్య రాశి వైపు మారుతున్నాడు. గురు-శుక్రులు కర్కాటక రాశిలో ఉండటం వల్ల కుటుంబ సంబంధాలు, ఆర్థిక విషయాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. శని మీన రాశిలో తిరోగమన దిశలో సంచారం చేయటం కొంతమందికి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.
నేడు పంచాంగం ఇలా
ఈ రోజు పంచాంగం ప్రకారం చూసినట్లయితే అశ్లేష నక్షత్రం, సప్తమి తిథి, ధ్రువ యోగం కలయిక ఆధ్యాత్మికత, మానసిక స్థిరత్వం, ఆర్థిక నిర్ణయాలకు అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం వంటి అన్ని రంగాల్లో రాశి ఫలాలు ఇలా ఉన్నాయి:

మేష రాశి:
మేషరాశి వారికి ఈ రోజు ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక లాభాలు అనుకుంటే దక్కవచ్చు. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి.
వృషభ రాశి:
వృషభ రాశి జాతకులు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. వృత్తిలో స్థిరత్వం కనిపిస్తుంది.
మిథున రాశి:
మిధునరాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలం. వృత్తి & వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. స్నేహితులు, బంధువుల సహాయం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి జాతకులకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. వృత్తిలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. సాయంత్రం మంచి వార్తలు వినవచ్చు.
సింహ రాశి:
సింహరాశి వారికి చంద్రుడు మీ రాశిలో ఉండటం వల్ల రోజు మంచిది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు, కుటుంబ సుఖం, ఉద్యోగంలో గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి.
కన్య రాశి:
కన్యా రాశి జాతకులు నేడు పనులు వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆరోగ్యంలో కొంత జాగ్రత్త అవసరం. సాయంత్రం సానుకూల అనుభవాలు ఉంటాయి.
తుల రాశి:
నేడు తులారాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా మారవచ్చు. కుటుంబంలో సంతోషం. సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి జాతకులకు పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి జాతకులకు వృత్తిలో కొంత ఆలస్యం ఉండవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. కుటుంబంలో మంచి సమాచారం వినవచ్చు.
మకర రాశి:
మకరరాశి జాతకులకు ఆరోగ్యం , ఆర్థికం రెండూ బాగుంటాయి. కొత్త పనులు చేపట్టడానికి అనుకూలం. స్నేహితుల సాయం లభిస్తుంది.
కుంభ రాశి:
కుంభరాశి జాతకులకు మానసికంగా కొంత అస్థిరత ఉండవచ్చు. ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్త వహించాలి. సాయంత్రం సానుకూల మార్పులు.
మీన రాశి:
మీనరాశి జాతకులకు శని స్వరాశిలో ఉండటం వల్ల ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పనుల్లో ఓపిక అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు శని దేవునికి నైవేద్యం పెట్టి, నల్ల నువ్వులు దానం చేయడం మంచిది.













Click it and Unblock the Notifications