క్రోధి నామ ఉగాది పంచాంగం: కర్కాటకరాశి వారికి అష్టమ శని.. కానీ ధనలాభం!!
ఏప్రిల్ 9వ తేదీన క్రోధి నామ ఉగాది. ఆ రోజు నుండి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. క్రోధి నామ సంవత్సరంలో తెలుగు పంచాంగం ప్రకారం కర్కాటక రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది? వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం వారికి ఏ విషయంలో బాగా కలిసి వస్తుంది? ఎదుర్కోవలసి వస్తుంది వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉగాది నుండి శుభప్రదంగా
కర్కాటక రాశి వారికి ఉగాది నుండి శుభప్రదంగా ఉంటుంది. శుక్రుడు అయిదవ స్థానంలో ఉండడంవల్ల కర్కాటక రాశి జాతకులు ప్రేమ జీవితం బాగుంటుంది. వివాహానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. శని అష్టమ స్థానంలో ఉండడంవల్ల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక గురుడు బలమైన స్థానంలో ఉండడం వల్ల ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

కర్కాటక రాశివారికి అష్టమ శని
ఈ సంవత్సరం కర్కాటకరాశి వారికి అష్టమ శని ఉండడం వల్ల ఆరోగ్యసమస్యలు, ఆస్తి వ్యవహారాలలో ఇబ్బందులు, ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్డుప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కనుక ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇదే అష్టమ శని వల్ల తలచిన అన్ని పనులు సానుకూలంగా పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధి కలుగుతుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాలలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. నూతన గృహనిర్మాణాలు, వాహనయోగాలు ఉన్నాయి.
కర్కాటక రాశి వారి ఆదాయ వ్యయాలు ఇలా
ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి రాహువు బలమైన స్థానంలో, కేతువు మూడో స్థానంలో సంచారం చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2 ఉంది . రాజపూజ్యం 6 అవమానం 6 గా ఉంది.
కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి
ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఊహించని ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది .సంపద పెరగడంతో ఆర్థిక స్థితి బలపడుతుంది. సామాజికంగాను పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆర్ధిక పరమైన విషయాలలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలని సలహా.
కుటుంబ పరిస్థితి
ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంతో విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. కొత్త ఇల్లు కానీ కొత్త వాహనాన్ని కానీ కొనుగోలు చేసి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ సంవత్సరం అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది.
విద్యాపరంగా కర్కాటక రాశి పరిస్థితి
కర్కాటక రాశి జాతకులకు విద్యాపరంగా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. చదువు విషయంలో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసేవారు ఈ సమయంలో విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారికి మంచి విద్యాసంస్థలలో అడ్మిషన్లు దొరుకుతాయి.
ఉద్యోగపరంగా
ఉద్యోగ పరంగా కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. పదోన్నతి లభిస్తుంది. పనిచేసే చోట గౌరవ మర్యాదలు దక్కుతాయి. వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications