క్రోధి నామ ఉగాది పంచాంగం: ఏడాదంతా మేషరాశి వారికి రాజయోగం!!
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరమంతా మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ సంవత్సరమంతా మేషరాశి వారి జాతకంలో గ్రహ స్థానాలు ఏ విధంగా ఉన్నాయి? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈ సంవత్సరం ఊహించని ప్రయోజనాలు
శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగం ఆధారంగా మేషరాశి వారికి చాలా అనుకూల ఫలితాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. బృహస్పతి ధన స్థానంలో సంచరించడం వల్ల, శని లాభ స్థానంలో సంచరించడం వల్ల, రాహు వ్యయ స్థానంలో సంచరించడం వల్ల, కేతువు కూడా ఆరవ స్థానంలో అనుకూలంగా సంచరించడం వల్ల మేష రాశి వారికి ఈ సంవత్సరం ఊహించని ప్రయోజనాలు కలుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మరింత మెరుగ్గా ఉంటుంది.

ధన స్థానంలో బృహస్పతి
మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం ధన స్థానంలో బృహస్పతి ఉండటం వల్ల వర్తక వ్యాపారాలలో లాభదాయకంగాను, ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే విధంగానూ ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వస్తు లాభం, ధన వృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ సంవత్సరం మేషరాశి జాతకులు బాగా ఆర్థికంగా ఎదగడానికి దోహదం చేస్తుంది.వీరికి ఈ ఏడాది రాజయోగమని చెప్పాలి.
లాభస్థానంలో శని
ఇక లాభస్థానంలో శని ఉండడం వల్ల వ్యాపార విషయంలో, నూతన గృహ నిర్మాణ విషయంలో శుభ ఫలితాలు వస్తాయి. శత్రువులపై విజయం దక్కుతుంది. ధైర్యంతో ముందడుగు వేస్తారు. వ్యయ స్థానంలో రాహువు ఉండటం వల్ల ఈ సమయంలో కాస్త వ్యసనాలకు దూరంగా ఉండాలని సలహా ఇవ్వబడింది. ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, మానసిక సంతోషం కలుగుతుంది. సినీ రంగాల వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు వస్తాయి.
మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలు
రైతాంగం కూడా ఆశించిన మేర ఫలితాలు పొందుతుంది. మేష రాశి వారి జీవితంలో జీవిత భాగస్వామితో సుఖసంతోషాలు ఉంటాయి. అవివాహితులకు వివాహాలు అవుతాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం అన్ని సానుకూల ఫలితాలు ఉండడం వల్ల వారి దశ మారుతుందని చెప్పవచ్చు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications