క్రోధి నామ ఉగాది పంచాంగం: వృషభరాశి జాతకం అద్భుతం... కానీ ఈ విషయాల్లో జాగ్రత్త!!
త్వరలో క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. క్రోధి నామ ఉగాదిని మన తెలుగు సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తాం. తెలుగు పంచాంగం ప్రకారం ఈ తెలుగు సంవత్సరంలో వృషభ రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఏ విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి? వంటి విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఏప్రిల్ తర్వాత వృషభ రాశి వారికి అన్నీ లాభాలే
2024 క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వారి జాతకం చాలా బాగుంటుంది. గురుడు మరియు శని శుభ స్థానాలలో ఉండటం వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని పనులలోను విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించిన తర్వాత వీరికి అన్ని విషయాలలోనూ లబ్ది జరుగుతుంది.

వృషభ రాశి వారికి రాజపూజ్యం 7 అవమానం ఎంతంటే
పంచమ స్థానంలో రాహు కేతువులు ఉండటం వల్ల సానుకూల ఫలితాలు, శని దేవుడు కూడా శుభ స్థానంలో ఉండటం వల్ల వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. వృషభ రాశి జాతకుల వైవాహిక జీవితం ఈ సంవత్సరం సంతోషదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి రాజపూజ్యం 7 అవమానం 3గా ఉంది. ఇక ఆదాయం 2, వ్యయం 8గా ఉంది.
కుటుంబ జీవితం
వృషభ రాశి వారి కుటుంబ జీవితం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. సంతానం కావాలనుకునే వారికి ఈ సంవత్సరం శుభ సమయం. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఈ సంవత్సరం విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
విద్యా పరంగా
వృషభ రాశి వారు ఈ సంవత్సరం విద్యారంగంలో కూడా పురోగతిని సాధిస్తారు. విద్యార్థులు ఉగాది తర్వాత కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకుంటే వృషభ రాశి వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారు పోటీ పరీక్షల్లో కూడా రాణించే అవకాశం ఉంది.
ఉద్యోగ పరంగా
ఈ సంవత్సరం వృషభ రాశి జాతకులకు ఉద్యోగ పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగుల బదిలీలు నిరాశను కలిగిస్తాయి. ఇక విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగంతో బాధపడేవారు ఉద్యోగాలను సంపాదించే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా జాబ్ పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది.
ఆరోగ్య పరంగా
ఆరోగ్యం విషయానికి వస్తే ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొంచెం వృషభ రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కోవాలి . గురుడి ప్రభావంతో ఉదర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా యోగా, ధ్యానం వంటివి చేయాలని సలహా.
ఈ విషయాల్లో జాగ్రత్త
ఈ సంవత్సరం వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలోనూ, ఏవైనా కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications