త్వరలోనే వీరికి సిరి సంపదల ఖజానాను ప్రకటించిన కుబేరయోగం!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాలు సంయోగం కారణంగా ఏర్పడే అనేక యోగాలు కొన్ని రాశుల వారికి శుభాలను మరికొన్ని రాశుల వారికి ఆశుభాలను కలిగిస్తాయి. కొన్ని రాశుల వారిని ధనవంతులను చేసే యోగాలలో కుబేరు యోగం ఒకటి. ఎవరి జాతకంలో అయితే కుబేర యోగం ఉంటుందో ఆ మనిషి మట్టి పట్టుకున్నా బంగారమే అవుతుంది.
సెప్టెంబర్ 26 న కుబేరయోగం
ఈ సమయంలో ఆ మనిషి ఒక్కసారిగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ప్రస్తుతం మరో రెండు రోజుల్లో 102 ఏళ్ల తర్వాత అద్భుతమైన కుబేర యోగం ఏర్పడబోతుంది. సెప్టెంబర్ 26వ తేదీన ఏర్పడబోతున్న కుబేర యోగం వల్ల దరిద్రుడు కూడా ధనవంతుడుగా మారతాడు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కుంభరాశి
కుంభ రాశి వారికి కుబేర యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి జాతకులు బృహస్పతి కారణంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. విందులు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయం అన్ని విధాల అదృష్ట సమయం.
ధనుస్సు రాశి
కుబేర యోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు కలిసొస్తుంది. ధనస్సు రాశి జాతకులు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. కోరుకున్న వారితో వివాహం జరుగుతుంది. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. శుభవార్తలు వింటారు. ఈ సమయం ధనుస్సు రాశి జాతకులకు ఏ పని చేసినా కలిసొస్తుంది.
తులారాశి
కుబేర యోగం కారణంగా తులా రాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు. తులా రాశి వారు ఈ సమయంలో బిజినెస్ లో రాణిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. వీరికి లాటరీలు తగిలే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఇదే అదృష్ట సమయం.
మీనరాశి
కుబేర యోగం కారణంగా మీనరాశి జాతకులకు కలిసొస్తుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. వర్ధక వ్యాపారాలు చేసేవారు ఆశించని దానికంటే ఎక్కువగా లాభాలను గడిస్తారు . ఉద్యోగాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. ఈ సమయంలో మీన రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇది అన్ని విధాల శుభాలను ఇచ్చే కాలం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications