శివరాత్రికి ముందే కుబేరయోగం.. కనకవర్షం కురిసే రాశులివే!

వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఉంటుందో, కొన్ని ప్రత్యేక రోజులకు కూడా అదే ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఫిబ్రవరి నెలలో శివరాత్రి పర్వదినం రాబోతున్న కారణంగా కొన్ని ఖగోళ యాదృచ్ఛికాలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీన బుధుడు, శుక్రుడు, శని దేవుడు ఒకే సరళరేఖ మీదకు వస్తున్న క్రమంలో 12 రాశుల వారి జీవితం పైన ప్రభావం పడుతుంది.

శివరాత్రికి ముందే కుబేరయోగం
బుధుడు, శుక్రుడు, శని దేవుడు ఒకే సరళరేఖ మీదకు వచ్చి కుబేర యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇక కుబేర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారికి సకల సంపదలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం..

kubera yoga before maha shivratri these are the wealthy zodiac signs with kubera yoga

మేషరాశి
కుబేర యోగం కారణంగా మేష రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. వీరికి ధనలాభం కలుగుతుంది. కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. మేషరాశి జాతకులు విందులు వినోదాలలో పాల్గొంటారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. కుబేర యోగం కారణంగా మేష రాశి వారికి శివరాత్రికి ముందే సంపన్నయోగం కలగబోతుంది.

సింహరాశి
సింహ రాశి వారికి కుబేర యోగం కారణంగా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. సింహ రాశి వారికి కుబేర యోగంతో భార్య తరపున ఉన్న ఆస్తులు సొంతం అవుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి యోగం ఉంది. ఎంతోకాలంగా వసూలు కానీ మొండి బాకీలు ఈ సమయంలో వసూలవుతాయి. ఖరీదైన ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. సింహ రాశి వారు జీవితంలో సెట్ అవ్వడానికి ఇది మంచి సమయం.

కన్య రాశి
కన్యా రాశి వారికి కుబేర యోగంతో బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాల వల్ల వీరికి అన్ని విధాలా లబ్ధి చేకూరుతుంది. కన్య రాశి జాతకులు రాజకీయాలలో రాణిస్తారు. చాలామందికి ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఇది కన్య రాశి వారికి అనుకూలమైన సమయం. శివరాత్రికి ముందే ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+