అద్భుతమైన రవి యోగంతో ఈ రాశులవారికి మొదలైన కుబేరయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నేడు చంద్రుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. చంద్రుడు తులా రాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతోపాటు దేవీ నవరాత్రులలో భాగంగా దుర్గాదేవి నేడు కుష్మాండ అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది . దీంతో ఈ రోజుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న నేడు ఎంతో శక్తివంతమైన రవి యోగం ఏర్పడుతుంది.
రవి యోగం కారణంగా అద్భుత ఫలితాలు
ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. సూర్యుని నక్షత్రం నుండి చంద్రుని నక్షత్రం నాలుగవ, ఆరవ, 9వ, 10వ, 13వ మరియు 20వ స్థానంలో ఉన్నప్పుడు రవి యోగం ఏర్పడుతుంది. ఈ రవియోగం కారణంగా సమాజంలో అపారమైన గౌరవం దక్కుతుంది. మరి రవి యోగం కారణంగా అద్భుతమైన ఫలితాలను పొందుతున్న రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభరాశి
రవి యోగం కారణంగా వృషభరాశి జాతకులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు డబ్బులు సంపాదిస్తారు. రవి యోగం కారణంగా మీరు విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృషభ రాశి వారు రవి యోగం ద్వారా భాగస్వామ్య వ్యాపారాలలోనూ, అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. పిల్లలతో సమయాన్ని గడుపుతారు. స్నేహితులతోనూ, బంధువులతోనూ బంధం మరింత బలపడుతుంది. ఇది వృషభరాశి వారికి అడ్డంకులు అన్నీ తొలగే కాలం.
కర్కాటక రాశి
రవి యోగం కారణంగా కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. రవి యోగం కారణంగా కర్కాటక రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ సమయం కర్కాటక రాశి వారికి నిజంగా అదృష్ట సమయం.
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఉన్న కుటుంబ కలహాలు తొలగిపోతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అనేక లాభాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఇది కర్కాటక రాశి వారికి అన్ని విధాలా విజయాలను చేకూర్చే కాలం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications