అక్టోబర్ 20వరకు వీరికి సంపదలవర్షం ప్రకటించిన కుజుడు!
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆగస్టు 26వ తేదీన అంటే నేడు కుజుడు మిధునరాశిలోకి సంచారం చేశాడు. కుజుడు మిధునరాశిలోకి నేడు మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు ప్రవేశించాడు. ఇదే రాశిలో కుజుడు అక్టోబర్ 20వ తేదీ వరకు ఉండనున్నాడు. ఆ తర్వాత కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో శుభ మంగళ యోగం ఏర్పడుతుంది. ఈ శుభయోగం ప్రభావంతో కొన్ని రాశులవారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.
మేషరాశి
నేటి నుంచి 55 రోజులు పాటు కుజ గోచారం కారణంగా మేషరాశి జాతకులకు ప్రయోజనాలు చేకూరతాయి. ఈ రాశిలో కుజుడు మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మేషరాశి జాతకులు చాలా ధైర్యంగాను ఉంటారు. మేషరాశి జాతకుల కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి.

వృషభ రాశి
నేటి నుంచి 55 రోజుల కాలం వృషభ రాశి వారికి శుభకాలంగా చెప్పవచ్చు. వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వృషభ రాశి జాతకులు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఆదాయం పెంచుకునేందుకు కొన్ని కొత్త పనులను చేస్తారు. ఈ కాలంలో మీరు మెరుగైన ఆర్థిక ఫలితాలను పొందుతారు.
మిధునరాశి
నేటి నుంచి 55 రోజుల కాలం కుజసంచారం వల్ల మిధున రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. మిధున రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగ్గా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సరైన సమయం.
కర్కాటక రాశి
నేటి నుంచి 55 రోజులు పాటు కర్కాటక రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పురోగతి కనిపిస్తుంది. విదేశీ వనరుల నుండి ప్రయోజనాలను పొందుతారు. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఖర్చుల విషయంలో నియంత్రణ ఉండేలా చూసుకోవాలి.
సింహరాశి
సింహ రాశి వారికి నేటి నుంచి 55 రోజులు కాలం బాగా కలిసి వస్తుంది. వీరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. కెరీర్ పరంగా వీరు మంచి పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో చేసే ప్రతి ప్రయత్నం లోను విజయాన్ని సాధిస్తారు.
కన్యారాశి
కన్యా రాశి వారు నేటి నుంచి 55 రోజుల కాలం అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో శుభ మంగళ యోగం ప్రభావంతో కన్యారాశి జాతకులు అన్ని రంగాలలోనూ రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి.
మకరరాశి
మకర రాశి వారికి 55 రోజులు పాటు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు. మకర రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి శుభవార్తలు వింటారు. ఆస్తి సంబంధిత వివాదాలకు పరిష్కారం లభిస్తుంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి కుజసంచారం కారణంగా నేటి నుంచి 55 రోజుల కాలం శుభసమయంగా చెప్పొచ్చు. కుంభరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. ఉన్నత విద్యను సాధించాలని భావించేవారు మంచి విజయం సాధిస్తారు. ప్రేమ వివాహం చేసుకోవాలని భావిస్తున్న వారికి కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications