కుజ కేతు యోగం.. ఈ రాశులవారిదే అఖండ ధనయోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. మే 7వ తేదీన కుజుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. కేతువు ఇప్పటికే సింహరాశిలో సంచారం మొదలుపెట్టాడు. కేతువు కుజుల సంయోగం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. కుజ కేతు యోగం కొన్ని రాశులకు అదృష్టాన్ని మరికొన్ని రాశులకు దురదృష్టాన్ని కలిగిస్తుంది. కుజ కేతుయోగం కారణంగా అదృష్టాన్ని పొందే రాశులేమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
కుజ కేతు యోగం కారణంగా మిధునరాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మిధునరాశి వారు ఈ సమయంలో అనేక ప్రయోజనాలను పొందుతారు. మిధున రాశిలో కుజుడు, కేతువు మూడవ ఇంట్లో కలయిక జరుగుతుంది. దీని కారణంగా వీరిలో ధైర్యం పెరుగుతుంది. వివిధ ఒప్పందాల కారణంగా వీరు విజయం సాధించే అవకాశం ఉంది. కుటుంబంలో తోడబుట్టిన వారి నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కెరీర్ మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

kuja Ketu Yoga These zodiac sign will get immense wealth

తులారాశి
కుజ కేతు యోగం కారణంగా తులారాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు అసంపూర్ణంగా ఉన్న పనులన్నింటిని పూర్తి చేస్తారు. తులారాశిలో ఆదాయ మరియు లాభ గృహంలో కుజ కేతువుల సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ఆర్థిక లాభాలు వస్తాయి. సంపద స్థాయిలు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. పదోన్నతులు వస్తాయి. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో కుజుడు కేతువు కలయిక కారణంగా వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి ప్రణాళికలు అన్ని కార్యరూపం దాలుస్తాయి. వృశ్చిక రాశిలో తొమ్మిదవ ఇంట్లో కుజ కేతువుల సంయోగం జరుగుతున్న కారణంగా వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం. ఆరోగ్యం బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలను నుండి ముందస్తు లాభాలు పొందే అవకాశం ఉంది. వివిధ వనరుల నుండి ఆదాయం పెరుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+