జులైలో రెండోసారి రాబోతున్న అద్భుతయోగం: వీరి బ్రతుకు బంగారం!!
జులై చివరి వారంలో శుక్రుడు సింహరాశిలో ప్రవేశించి సింహరాశిలో లక్ష్మీనారాయణ యోగాన్ని సృష్టిస్తున్నాడు. జులై 19న సింహరాశిలో ప్రవేశించిన బుధులు, జులై 31న శుక్రుడు కలయిక వల్ల ఏర్పడుతున్న లక్ష్మీనారాయణ యోగం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. వీరికి కెరీర్ విషయంలో తిరుగులేని విజయాలను అందిస్తుంది.
లక్ష్మీ నారాయణ యోగం
ఇప్పటికే జులై మాసంలో ఒకసారి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడింది. మళ్లీ 11 రోజులు తర్వాత లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతుంది. జూలైలో రెండవసారి ఏర్పడుతున్న లక్ష్మీనారాయణ యోగం ఫలవంతమైనది, శక్తివంతమైనది. ఈ యోగం కారణంగా మనిషి రాత్రికి రాత్రే సంపన్నుడు అవుతాడని చెబుతున్నారు. మరి అటువంటి లక్ష్మీనారాయణ యోగంతో లబ్ధి పొందే రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
లక్ష్మీనారాయణ యోగం కారణంగా మేష రాశి జాతకులకు అనేక శుభ ఫలితాలు వస్తాయి. మేష రాశి వారికి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఈ సమయంలో వీరు ధన లాభాన్ని కూడా పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వీరి జీవితంలోనూ సంతోషకరమైన వాతావరణముంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా, ఉత్సాహంగా సాగుతుంది.
మిధున రాశి
మిధున రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం కలిసొస్తుంది ఈ సమయంలో వీరు నూతన ఆదాయ మార్గాలను చూస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కెరీర్లో ఎదుగుదలకు ఊహించని అవకాశాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గతంతో పోలిస్తే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వర్తక వ్యాపారాలు విస్తరిస్తాయి.
సింహరాశి
లక్ష్మీనారాయణ యోగం కారణంగా సింహరాశి వారికి కలిసొస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఏ పని చేసిన విజయం వరిస్తుంది. పనిలో ఆశించిన లాభాలను పొందుతారు. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. సంపద వృద్ధి జరుగుతుంది. కెరీర్లో మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.
వృశ్చిక రాశి
లక్ష్మీనారాయణ యోగం వల్ల వృశ్చిక రాశి వారు లబ్ధిని పొందుతారు. పనిలో చోటుచేసుకునే అడ్డంకులు తొలగిపోతాయి. ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. వర్తక వ్యాపారాలను విస్తరించడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. ఈ సమయంలో కెరీర్ కూడా గణనీయంగా వృద్ధి చెందుతుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications