అక్టోబర్ లో బుధ,శుక్రులు కలిసి లక్ష్మీనారాయణ యోగంతో వీరికి సంపదల వరమిచ్చారు!
సెప్టెంబర్ 18వ తేదీన తులారాశిలోకి శుక్ర సంచారం జరుగుతుంది. అంతేకాదు వచ్చేనెల తులా రాశిలో బుధ సంచారం జరగనుంది. బుధుడు, శుక్రుడు ఈ రెండు గ్రహాలసంయోగం కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతుంది. ఈ లక్ష్మీనారాయణ యోగంతో మూడు రోజులపాటు మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
లక్ష్మీనారాయణ రాజయోగం.. మూడు రాశులవారికి అదృష్టం
సెప్టెంబర్ 18 న తులా రాశిలోకి శుక్ర సంచారం, ఆపై అక్టోబర్ 10వ తేదీన తులారాశిలోకి బుధ సంచారం జరుగుతుంది. ఇక అక్టోబర్ 10వ తేదీనే తులా రాశిలో శుక్రుడు, బుధుడు కలయిక కారణంగా లక్ష్మీనారాయణ రాజ యోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశుల వారికి ఊహించని అదృష్టాన్ని అందిస్తుంది. ఇక ఆ రాశుల వివరాలలోకి వెళితే..

తులారాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా తులారాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. తులా రాశి లగ్న గృహంలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతున్న కారణంగా తుల రాశి జాతకులకు ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మెరుగైన సంబంధాలు కొనసాగిస్తారు. డబ్బు సంబంధిత సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఉద్యోగరీత్యా శ్రమకు తగిన ఫలితం దొరుకుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
మకర రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు అన్ని విధాలా లాభం జరుగుతుంది. మకర రాశి వారికి ఇది అదృష్ట సమయం. మకర రాశి జాతకులు ఈ సమయంలో భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో చాలా పురోగతిని చూస్తారు. వ్యాపారస్తులు ఈ సమయంలో చాలా డబ్బును సంపాదిస్తారు.
కుంభరాశి
కుంభరాశి వారి తొమ్మిదవ ఇంట్లో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్ లోను పురోగతి కనిపిస్తుంది. కెరీర్ పరంగా మీకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. విదేశీయానం చేయడానికి ఇదే సరైన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications