శ్రావణమాసంలో అద్భుతయోగం.. వీరికి కుబేర కటాక్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా రాశులన్నీ ప్రభావితం అవుతున్నాయి. ఇక ఆగస్టు నెలలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. కొన్ని శుభ యోగాలు కాగా మరికొన్ని అశుభ యోగాలు. ఇక ఆగస్టు నెలలో సింహరాశిలో బుధుడు శుక్రుడు కలయికతో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది.
లక్ష్మి నారాయణ రాజయోగం
సంపదలను ఇచ్చే శుక్రుడు జులై 31వ తేదీన సింహరాశిలో ప్రవేశించాడు. ఇక ఇప్పటికే ఈ రాశిలో గ్రహాల రాకుమారుడు బుధుడు ఉన్నాడు. సింహరాశిలో బుధ శుక్రుల కలయిక ఆగస్టు 22వ తేదీన జరగనుంది. దీని ఫలితంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారు కుబేరుడి అనుగ్రహాన్ని పొంది సంపన్నులు అవుతారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారు పవిత్రమైన శ్రావణమాసంలో ఏర్పడుతున్న లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు. ఈ సమయంలో వీరికి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. సంపాదన పెరుగుతుంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ సమయంలో మేషరాశి జాతకుల వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.
కన్యారాశి
బుధ, శుక్రుల కలయిక వల్ల ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగంతో కన్యారాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో కన్యా రాశి జాతకులకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. సంపదలో పురోగతి ఉంటుంది. ఈ సమయంలో చేసే ఆలోచనలు, ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి.
వృశ్చిక రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పనిచేసే చోట ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. జీవిత భాగస్వామి నుండి ఈ సమయంలో మద్దతు పొందుతారు. వీరి వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.
కుంభరాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కుంభ రాశి వారికి శ్రావణమాసంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సమస్యల పరిష్కారం జరుగుతుంది. పనిలో మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక లాభాలకు మంచి అవకాశాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. సంపదలు పెరుగుతాయి .అప్పుల నుండి విముక్తి లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications