12ఏళ్ళ తర్వాత లక్ష్మీనారాయణ రాజయోగం.. వీరు పట్టిందల్లా బంగారం!

వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతినెల గ్రహాలు స్థాన చలనం జరుపుతూనే ఉంటాయి. ముఖ్యంగా బుధ,శుక్ర గ్రహాలు తరచూ తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఈ రెండు గ్రహాలు 12 సంవత్సరాల తర్వాత మీనరాశిలో కలవబోతున్నాయి. దీనివల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంది.

2025లో లక్ష్మీ నారాయణ యోగం
సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు జనవరి 28వ తేదీ 2025న మీనరాశిలోకి సంచరిస్తున్నాడు. మే 31వ తేదీ వరకు శుక్రుడు మీనరాశిలోనే సంచరిస్తాడు. ఇక బుధ గ్రహం ఫిబ్రవరి 27వ తేదీ రాత్రి 1.14 నిముషాలకు మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. దీంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల లబ్ధిని పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Lakshminarayana Raja Yoga after 12 years golden life to these zodiac signs

వృషభ రాశి
వృషభ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాజయోగం కారణంగా వృషభ రాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారంలో అన్ని విధాల లాభాలు వచ్చే అవకాశం ఉంది.

మిధున రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం మిధున రాశి వారికి ముఖ్యమైన విజయాలను అందిస్తుంది. ఈ యోగం వల్ల ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కూడా ఇది శుభ ఫలితాలను ఇస్తుంది.

కన్య రాశి
కన్యా రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం లబ్ధిని చేకూరుస్తుంది. కన్యా రాశి వారు వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదురుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.

కుంభరాశి
కుంభ రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. పెండింగ్ పనులు తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు విజయం వరిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మీనరాశి
మీనరాశిలో బుధుడు శుక్రుడు సంయోగం జరగడం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీన రాశి వారికి సానుకూల ప్రయోజనాలు వస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సమస్యల పరిష్కారం అవుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+