2025 చివరి శక్తివంతమైన అమావాస్య .. ఈ రాశుల పంట పండుతుంది!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. గ్రహాలు మాత్రమే కాదు తిధులు కూడా మన జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా అమావాస్య తిధికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. 2025 సంవత్సరంలో రేపు చివరి అమావాస్య. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య తర్వాత కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
వృషభరాశి
అమావాస్య వృషభ రాశి జీవితాలలో సానుకూల ఫలితాలను తెస్తుంది. ఊహించని బహుమతులను ఈ సమయంలో పొందుతారు. కృషికి తగిన ఫలితం ఉంటుంది. సంతోషంగా ఉంటారు. కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది.

సింహరాశి
సింహ రాశి వారికి అమావాస్య చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు అమావాస్య తర్వాత ఏ పని చేసినా కలిసి వస్తుంది. జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది .సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయం మీకు ఆర్ధిక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ధనుస్సురాశి
ఈ అమావాస్య ధనుస్సు రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ అమావాస్య తర్వాత ధనుస్సు రాశి వారు సంతోషంగా ఉంటారు. మానసిక పరిస్థితిలో మార్పును చూస్తారు. ధనస్సు రాశి వారి సమస్యలు పరిష్కారమవుతాయి. వారి మనసు తేలిక పడుతుంది.
కుంభరాశి
ఈ అమావాస్య కుంభ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. రూపొందించిన ప్రణాళికలలో మార్పులు వచ్చినా అద్భుతమైన ఫలితాలను చూస్తారు. శుభ వార్తలను వింటారు. వర్తక, వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది.
మీనరాశి
ఈ అమావాస్య మీన రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీన రాశి వారు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. అడ్డంకులు తొలగిపోతాయి. కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications