అక్టోబర్ లో ఈ రాశులవారికి సంపన్నయోగం ప్రసాదించిన చివరి సూర్యగ్రహణం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహణం అశుభ సమయంగా చెప్తారు. గ్రహాల కదలికలు గానీ, గ్రహణాలు గానీ అన్ని రాశులవారిపైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంవత్సరం తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ మాసంలో ఏర్పడగా, రెండో సూర్యగ్రహణం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడుతోంది .అయితే ఈసారి ఏర్పడనున్న సూర్యగ్రహణం చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం లో సూర్యుడు రింగ్ ఆఫ్ ఫైర్ లా ఉంటాడు.
అక్టోబర్ 2న సూర్య గ్రహణం చాలా స్పెషల్
హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యుడు కన్యా రాశిలో ఉన్న సమయంలోనే సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అక్టోబర్ 2 వతేదీన ఏర్పడే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకం. అయితే అక్టోబర్ 2వ తేదీ పితృపక్షానికి చివరి రోజు అయిన సర్వపితృ అమావాస్య కావడంతో ఈసారి సూర్యగ్రహణం నాడు కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతున్నాయి.

సూర్యగ్రహణం అదృష్ట రాశులు
భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించబోదు. అయినప్పటికీ సూర్య గ్రహణ ప్రభావం మాత్రం ద్వాదశ రాశులవారి పైన ఉంటుంది. ఈ సారి ఏర్పడే సూర్యగ్రహణం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం
మనం తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా లబ్ది జరుగుతుంది. ఈ సమయంలో మేష రాశి వారికి ఆర్ధిక లాభాలు ఉంటాయి. ఏ పని చేసినా సత్ఫలితాలను పొందుతారు. మేషరాశి జాతకుల కుటుంబ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మేష రాశి జాతకులకు వర్తక, వ్యాపారాలు, ఉద్యోగాలలో కలిసొస్తుంది.
మిధున రాశి
మిధున రాశి వారికి అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా ప్రయోజనాలు చేకూరుతాయి. మిధున రాశి జాతకులు ఈ సమయంలో భారీ ఆర్థిక లాభాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది శుభ సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా కలిసొస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలను పొందుతారు.
సింహరాశి
అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం సింహరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. నూతన గృహాలు, నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు ఉంటాయి. సింహరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. జీవితంలో అన్ని ఆందోళనలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.
కన్యారాశి
కన్యా రాశి జాతకులకు అక్టోబర్ 2వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో కన్య రాశి జాతకులు ఆస్తులు, వ్యాపారాలు మొదలైన వాటిలో లాభాలను పొందుతారు. అన్ని విధాలా ఇది లాభదాయకంగా ఉంటుంది. ఏ పని చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి ఇది సరైన సమయం. శుభవార్తలను వింటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications