నవంబర్లో ఈ రాశులవారిని బిచ్చగాళ్ళగా మారుస్తానని హెచ్చరిస్తున్న శని.. జాగ్రత్త
నవగ్రహాలలో శని గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శని గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి నెమ్మదిగా కదిలే గ్రహం. శని కఠినమైన ఫలితాలను ఇచ్చే గ్రహం. అయితే జీవితంలో శని ప్రభావం ఎంతగా ఉంటుందంటే ధనవంతులు కూడా బిచ్చగాళ్ళు అవుతారు, బిచ్చగాడు కూడా ధనవంతుడిగా మారతాడు. అలాంటి ప్రభావం ఒక్క శని మాత్రమే చూపగలడు.
శని ప్రత్యక్ష సంచారంతో ప్రతికూల రాశులు
ఇక శని నవంబర్ మాసంలో తన తిరోగమన చలనం నుండి ప్రత్యక్షంగా మారబోతున్నాడు. ఈ మార్పు అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక శని సంచారం ఏ గ్రహాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఏ ఏ రాశులవారు దీని కారణంగా ఆర్ధిక నష్టాలను, కష్టాలను ఎదుర్కోబోతున్నారు అనేది తెలుసుకుందాం.

కర్కాటక రాశి
శని కారణంగా కర్కాటక రాశి జాతకులు ఈ మాసంలో ప్రతికూల ఫలితాలు చూడబోతున్నారు. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కుటుంబంలో విబేధాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది.పని చేసే చోట సహోద్యోగులతో విబేధాలు రావచ్చు. ఉద్యోగాలలో మార్పులు జరగవచ్చు. ఆర్ధికంగా ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది.ఖర్చులు పెరగవచ్చు. మానసికంగానూ ఆశాంతి కలిగే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
శని కారణంగా వృశ్చిక రాశి జాతకులకు ఈ నెలలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి జాతకులు శని ప్రభావం కారణంగా జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. వృశ్చిక రాశి జాతకులు అన్ని పనులలోనూ సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది వీరికి ఆర్ధిక నష్టాలను, కష్టాలను కలిగించే సమయం. కనుక వృశ్చిక రాశి జాతకులు ఆచి తూచి అడుగు వెయ్యటం మంచిది. ఇది వీరికి కొత్త పనులను ప్రారంభించటానికి సరైన సమయం కాదు.
ధనుస్సు రాశి
శని కారణంగా ధనుస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలు రావు. ఈ సమయంలో శని ధనుస్సు రాశి జాతకుల సహనాన్ని పరీక్షిస్తాడు. ధనుస్సు రాశి వారికి ఇప్పుడు ఏ పని చేసినా ఫలితం మాత్రం ఆశించిన మేరకు రాదు. ధనుస్సు రాశి వారికి ఆర్దికంగా నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఇది ధనుస్సు రాశి వారికి కష్టాలను, నష్టాలను ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications