త్వరలో పులిపంజా చీల్చి సంపన్నులయ్యే రాశులవారు వీరేనన్న శని!
వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. శని భగవానుడు కర్మ మరియు న్యాయదేవుడిగా గుర్తించబడ్డాడు. మన జీవితంలో మనం చేసే కర్మలకు ఫలితాలను ఇచ్చే దేవుడిగా శనిదేవుడిని భావిస్తారు. నవగ్రహాలలో అత్యంత నిదానంగా కదిలే గ్రహమైన శని గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశి లోకి సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది.
శని ఉత్తరాభాద్ర నక్షత్ర సంచారం
శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మాత్రమే కాదు, ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి కూడా సంచారం చేస్తుంది. ఏప్రిల్ 28వ తేదీన శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రం లోకి ప్రవేశిస్తున్నాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తుంటే, మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను పొందుతున్నారు.

వృషభ రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వృషభ రాశిలో పదకొండవ స్థానంలో శని సంచరిస్తాడు. కాబట్టి ఈ సమయం వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి మన్ననలు వస్తాయి.. కుటుంబ సమస్యలు తీరుతాయి. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు ఆస్కారం ఉంది. వ్యాపారవేత్తలకు ఇది లాభదాయకమైన సమయం.
మిధున రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. శని దేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తూ మిధున రాశిలోని పదవ ఇంట్లో ఉంటాడు . దీని కారణంగా వీరికి శ్రమకు తగిన ఫలితం వస్తుంది. డబ్బు ఆదా అవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కెరీర్ లోను పురోగతి కనిపిస్తుంది.
తులారాశి
తులారాశిలో శని 6వ ఇంట్లో సంచారం చేస్తాడు. దీని ఫలితంగా తులా రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరి శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. పూర్వీకులకు సంబంధించి ఆస్తులు కలిసి వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. తులా రాశి వారికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఈ సమయంలో వీరి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications