శనిదేవుడికి ఈ రాశులంటే మహాప్రీతి.. వీరికి జీవితాంతం కింగ్ సైజ్ లైఫ్!
శని దేవుడు న్యాయ దేవుడు. నవగ్రహాలలో శని దేవుడికి ఒక ముఖ్యమైన స్థానం ఉంటుంది. కర్మలకు అధిపతిగా, క్రమశిక్షణకు ప్రతినిధిగా శనిదేవుడిని భావిస్తారు. సహజంగా శనిదేవుడిని కష్టాలు కలిగిస్తాడని అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. క్రమశిక్షణతో జీవించే వారికి శని మంచి ఫలితాలను ఇస్తాడు.
శని దేవుడికి ఇష్టమైన రాశులు
శని సహనాన్ని నేర్పిస్తాడు. శని జీవితంలో ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనేక ప్రయోజనాలను కలిగిస్తాడు. అటువంటి శని దేవుడికి కొన్ని ఇష్టమైన రాశులు ఉన్నాయి ఆ రాశుల పట్ల శని దేవుడు ఎప్పుడు ప్రేమతో ఉంటాడని, ఆ రాశుల వారికి సకల శుభాలు కలిగి చేస్తాడని చెబుతారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారిపైన శని దేవుని దయ ఉంటుంది. వృషభ రాశి జాతకులను శని దేవుడు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. వీరు చేసే అన్ని పనులలోను వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తాడు. ఈ రాశి వారు ఎటువంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని శని దేవుడు ఇస్తాడు. శని దేవుని ఆశీస్సులతో వీళ్ళు పనిలో విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా పురోగమిస్తారు.
తులారాశి
తులా రాశి వారి పైన శని దేవుడి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. శని దేవుడికి ఇష్టమైన రాశులలో తులా రాశి ఒకటి శని దేవుడి దయవల్ల తులారాశి వారు బలమైన సంకల్పశక్తి ని ఏకాగ్రత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా శని దేవుడు ఎప్పటికప్పుడు వారిని కాపాడతాడు. అయితే శనివారం రోజు ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో వారికి శనిదేవుడు మరిన్ని ప్రయోజనాలను కలిగిస్తాడు.
మకర రాశి
మకర రాశి వారి పైన శని కటాక్షం ఉంటుంది. మకర రాశి జాతకులు శనిదేవుని ప్రేమ కారణంగా వారి జీవితంలో ఏ పని చేసినా విజయాలను సాధిస్తారు. వారు చేసే అన్ని పనులను సానుకూల ఫలితాలను పొందుతారు. శనిదేవుడు ఆశీర్వాదంతో జీవితంలో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి రంగంలోనూ మకర రాశి జాతకులు విజయాలు సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసిన అవసరం లేకుండా శని దేవుడు చూస్తాడు.
కుంభరాశి
శని దేవుడికి బాగా ఇష్టమైన రాశులలో కుంభరాశి ఒకటి. కుంభరాశి జాతకులు శని దేవుడు దయ కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని శనిదేవుడు ఎప్పటికీ ఇస్తాడు. ఆర్థికంగా లోటు లేకుండా చూస్తాడు. శనిదేవుని ఆశీర్వాదంతో కుంభరాశి జాతకులు జీవితాంతం సంతోషంగా జీవిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకుల పైన శని దేవుడి కటాక్షం ఉంటుంది. ధనుస్సు రాశి జాతకులకు జీవితాంతం ఎటువంటి కష్టాలు రాకుండా శనిదేవుడు కాపు కాస్తాడు. వీరు ఏ పని చేసినా సత్ఫలితాలు వచ్చేలా చూస్తాడు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, జీవితంలో సంతోషం ఉండేలా శని దేవుడు వీరిని ఆశీర్వదిస్తాడు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications