కార్తీకమాసంలో వీరి సిరిసంపదలకు నేనే గ్యారెంటీ అంటున్న శనిదేవుడు!
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. శనిని న్యాయదేవతగా చెబుతారు. శని క్రమశిక్షణకు, ఓర్పుకు మారు పేరు. కష్టపడి పనిచేసే వారిపైన ఎప్పుడు శని కటాక్షం ఉంటుంది. అయితే మరో పది రోజుల్లో శని ప్రత్యక్ష మార్గంలో సంచరించబోతున్నాడు. నిదానంగా ప్రయాణం చేసే గ్రహమైన శనిగ్రహం ప్రత్యక్ష సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది.
మరో పదిరోజుల్లో శని ప్రత్యక్ష సంచారం
కర్మదాతగా పిలవబడే శని దేవుడు తిరోగమన సంచారం నుంచి ప్రత్యక్ష మార్గంలో పయనించడం నవంబర్ 15వ తేదీన ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే శని ప్రత్యక్ష మార్గంలో సంచారం మొదలు పెడతాడో అప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశుల పైన ఆ ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో మూడు రాశుల వారికి శని ప్రత్యక్ష సంచారం లాభాలను కలుగజేస్తుంది.

కుంభరాశి
శని ప్రత్యక్ష సంచారం వల్ల కుంభ రాశి వారికి మేలు జరుగుతుంది. నవంబర్ 15వ తేదీ నుంచి కుంభ రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. కుంభ రాశి వారి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో అన్ని విధాలుగా వీరికి ప్రయోజనాలు చేకూరుతాయి. నవంబర్ 15 తర్వాత వీరికి మంచి రోజుల ప్రారంభమవుతాయి.
మకర రాశి
శని ప్రత్యక్ష సంచారం మకర రాశి జాతకులకు మరో పది రోజుల్లో అదృష్టం ఇవ్వబోతుంది. మకర రాశి జాతకులు ఆదాయపరంగా మంచి లాభాలను పొందుతారు. ఏ పని చేసినా లాభాలు వస్తాయి. కోర్టు కేసుల్లోనూ ఉపశమనం లభిస్తుంది. ఊహించని ఆర్థిక లేదా ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉంది. మరో 10 రోజుల్లో శని ప్రత్యక్ష సంచారం కారణంగా మకర రాశి జాతకులు అన్ని విధాల అదృష్టవంతులుగా మారుతున్నారు.
మీనరాశి
మీనరాశి జాతకులకు శని ప్రత్యక్ష సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీన రాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో గౌరవ, మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి కూడా పురోగతి కనిపిస్తుంది. ఇది మీన రాశి వారికి అదృష్ట సమయంగా చెప్పవచ్చు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications