ఏప్రిల్ 28వరకు ఈ రాశులను వదలబొమ్మాలీ అంటున్న శనిదేవుడు!
నవగ్రహాలలో అన్ని గ్రహాల కంటే చాలా నిదానంగా కదిలే గ్రహం శనిగ్రహం. శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది. ఆ పరమశివుడు అంతటివాడికి కూడా శని ప్రభావం తప్పలేదు. అంత శక్తి కలిగిన శని ఏ రాశిలో సంచరించినప్పటికీ అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాడు.
పూర్వాభాద్ర నక్షత్రంలో శని సంచారం
శని సంచారం కొన్ని రాశులవారికి సానుకూల ఫలితాలను కలిగిస్తే, మరికొన్ని రాశులవారు శని కారణంగా దురదృష్ట ఫలితాలను చూస్తారు. క్రమశిక్షణకు, సహనానికి మారుపేరైన శని ప్రస్తుతం పూర్వాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. గురువు అధిపతి అయిన పూర్వభాద్ర నక్షత్రంలో శనిసంచారం ఏప్రిల్ 28వ తేదీ వరకు జరుగుతుంది. అయితే ఈ నక్షత్రంలో శని సంచారం కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కుంభరాశి
కుంభరాశి వారు ఏప్రిల్ 28వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలపైన అదనపు శ్రద్ధ వహించాలి. డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నం చేయాలి. సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఉపయోగించాలి. లేదంటే అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో పనిలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో జరిగిన కొన్ని విషయాలు మానసిక క్షోభను కలిగిస్తాయి. శనిప్రభావం కారణంగా కుంభరాశి వారికి అన్నీ దురదృష్ట ఫలితాలే వస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారు ఏప్రిల్ 28వ తేదీ వరకు అనేక కష్టాలను పడవలసి వస్తుంది. శని సంచారం కారణంగా వృశ్చికరాశి వారికి కుటుంబ సమస్యలు పెరుగుతాయి. వ్యాపారంలో పురోగతి కనిపించదు. భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగాలు చేసేవారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో మంచి జరగాలంటే ప్రతి పనిని ఓపికతో చేయాలి. ఇది వృశ్చికరాశి వారికి ఇబ్బందికర సమయం.
మీనరాశి
పూర్వభద్ర నక్షత్రంలో శని సంచారం కారణంగా మీనరాశి జాతకులు కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసిన జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బంది పడవలసి వస్తుంది. మీన రాశి జాతకులు ఈ సమయంలో నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications