శివయ్య శాసనం.. తనకిష్టమైన ఈ రాశులవారికి జీవితాంతం సంపదల వర్షం!
పరమ శంకరుడు భక్తవ శంకరుడు, భోళా శంకరుడు. తనను నమ్మిన భక్తులను ఎప్పటికప్పుడు కరుణించి కాపాడే పరమశివుడికి చాలా ఇష్టమైన రాశుల వారు ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడి అనుగ్రహం అన్ని రాశుల వారి పైన ఉన్నప్పటికీ కొన్ని రాశుల వారి పైన ఆయన కటాక్షం ఉంటుందని చెబుతారు.
శివుడికి ఇష్టమైన రాశుల వారు
కొన్ని రాశులవారిని జీవితాంతం పరమశివుడు కంటికి రెప్పలా కాపాడుతాడు అని చెబుతారు. శివుడికి ఇష్టమైన రాశుల వారికి ఎటువంటి కష్టాలు రాకుండా ఆయన కాపాడుతాడు అని చెబుతారు. మరి శివయ్యకు ఇష్టమైన ఆ రాశుల వారు ఎవరు? వారికి శివయ్య కటాక్షంతో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశికి అధిపతి శివుని నుదుటిపై ఉన్న చంద్రుడు కావడం వల్ల కర్కాటక రాశి వారిని ఎల్లప్పుడూ శివుడు వివిధ సంక్షోభాల నుంచి, సమస్యల నుంచి కాపాడుతూ ఉంటాడు. కర్కాటక రాశి వారిపై శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కర్కాటక రాశి వారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా బాధపెడితే వారు మరిచిపోలేరు. ఇక ఈ సున్నిత మనస్కులను శివుడు రక్షా కవచంగా నిలిచి కాపాడుతూ ఉంటాడు.
తులారాశి
శుక్రుడు తులా రాశికి అధిపతి .తులారాశి జాతకులు గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు. వీరిని శివుడు కాపాడుతూ ఉంటాడు. తులారాశి వారి పైన శివుని కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. తులా రాశి జాతకులు మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు అభిరుచుల కోసం డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడరు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. వీరికి ఎప్పుడూ రక్షా కవచంగా శివుడు నిలిచి కాపాడుతూ ఉంటాడు.
మకర రాశి
మకరరాశి పాలకగ్రహం శనిదేవుడు. శనిదేవుడు శివుడి యొక్క గొప్ప భక్తుడు. శివుడిని శనిదేవుడు గురువుగా భావిస్తాడు. శనిదేవుడు శివుడి ఆశీస్సులతోనే దండాధికారి పదవిని పొందాడు. అందువలన శివుడు మకరరాశి జాతకులపైన ప్రత్యేక ఆశీర్వాదాలు కలిగి ఉంటాడు. మకరరాశి వారిని శివుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. మకరరాశి వారు కష్టపడి పని చేస్తారు. వారు తమ తమ రంగాలలో విజయం సాధిస్తారు. వారికి శివుడు ఎప్పుడు అండగా ఉంటాడు.
కుంభరాశి
కుంభ రాశి మహా దేవునికి చాలా ప్రియమైన రాశి. ఈ రాశి వారినీ అకాల మరణం నుండి శివుడు కాపాడుతాడు.శనిదేవుడు కుంభరాశిని పాలిస్తాడు. శివుడు ఎప్పుడు శనిదేవుని ఆదరంగా చూస్తాడు. కాబట్టి శనిదేవుని రాశైన కుంభరాశిపై కూడా తన కటాక్షాన్ని చూపిస్తూ ఉంటాడు. వీరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. వీరు కష్టపడి పని చేసేవారు మరియు శ్రద్ధ కలిగిన వారు. వారు తమ జీవితంలో పెద్ద సవాళ్లను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. అటువంటి శక్తిని శివుడు వారికి ఇస్తాడు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications