జులై 11నుండి వీరికి సకల సంపదలను అనుగ్రహించిన శివుడు, ఇంకో ప్రత్యేకత ఏంటంటే
జులై మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మాసంలోనే శ్రావణమాసం ప్రారంభమవుతుంది. జూలై మాసంలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు వివిధ రాశుల్లోకి సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే జూలై మాసంలో 11వ తేదీన శ్రావణమాసం ప్రారంభం అవుతుండగా అదే రోజు శక్తివంతమైన శివయోగం ఏర్పడుతుంది.
శ్రావణ మాసంలో శివయోగం
ఈ శివ యోగం సకల శుభాలను, సంతోషాలను ఇస్తుంది. ముఖ్యంగా ద్వాదశ రాశులలో వృషభ రాశి, మిధున రాశి, కన్యా రాశి, కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభాలను శివయ్య ప్రసాదిస్తాడు. జూలై మాసంలో శివయ్య అనుగ్రహంతో లబ్ధి పొందుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
జూలై మాసంలో వచ్చే శ్రావణమాసం ఆరంభం నుండి వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృషభ రాశి వారికి అనేక విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో పాటు వృషభ రాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. ఎంతో ఉన్నతమైన స్థానాలకు చేరుకుని సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.
మిధున రాశి
జూలై మాసంలో శ్రావణమాసం ప్రారంభం నుండి మిధున రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మిధున రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఏ పని చేసిన విజయం వరిస్తుంది. మిధున రాశి వారికి ఇది శుభ సమయం.
కన్యారాశి
కన్యా రాశి వారికి శ్రావణమాసం ప్రారంభం నుండి కలిసి వస్తుంది. శివయ్య ప్రత్యేక ఆశీర్వాదంతో కన్యారాశి జాతకులు లబ్ధిని పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగాలు వస్తాయి. ఇది కన్యా రాశి జాతకులు అయిన విద్యార్థులకు అద్భుతమైన సమయం. విద్యార్థుల కోరికలు తీరుతాయి. ఈ సమయంలో కన్యా రాశి వారు ఏ పని చేసిన కలిసి వస్తుంది.
కుంభరాశి
కుంభరాశి వారికి శ్రావణ మాసం ప్రారంభం శుభ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారు ఈ మాసంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ మాసంలో కుంభరాశి జాతకులు సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications