ఈ రాశులవారికి 365 రోజులు సంపదలను ఇచ్చే వినాయకుడు!
లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు, విష్ణుమూర్తికి ఇష్టమైన రాశులు, శివునికి ఇష్టమైన రాశులు ఏ విధంగా ఉంటాయో అలాగే వినాయకుడికి కూడా ఇష్టమైన రాశులు ఉన్నాయి. త్వరలో వినాయక చతుర్థి జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరూ గణేష్ నవరాత్రుల పైన ఫోకస్ చేస్తున్నారు. గణేష్ నవరాత్రులు ఏ విధంగా నిర్వహించాలి? ఏ విధంగా పూజలు చేయాలి? ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి అని ప్రతి వాడలోనూ చర్చించుకుంటున్నారు.
వినాయకుడికి ఇష్టమైన రాశులు ఇవే
ఇదే సమయంలో వినాయకుడికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకోవడం ఒకింత ఆసక్తిని కలిగించే అంశమే మరి ప్రస్తుతం మన వినాయకుడికి ఇష్టమైన రాశులు ఏమిటో తెలుసుకుందాం. వినాయకుడికి ముఖ్యంగా మూడు రాశులు అంటే చాలా ఇష్టం. మేషరాశి, మిధునరాశి, మకర రాశి వారిపై వినాయకుడి కటాక్షం ఎప్పటికీ ఉంటుంది.

మేష రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి జాతకులు వినాయకుడికి అత్యంత పాత్రమైన వారు. వీరికి వినాయకుడి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. వినాయకుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల ఈ రాశి వారు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. ఎటువంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మేష రాశికి కుజుడు అధిపతి కావడం వల్ల వీరికి ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ప్రతీరంగంలోనూ తమదైన ముద్ర వేసుకుంటారు.
మిధున రాశి
మిధున రాశి వారికి వినాయకుడి కరుణాకటాక్షాలు ఉంటాయి. మిధున రాశి వారు చాలా తెలివిగలవారు. ప్రతిభ ఉన్నవారు వీరిపైన వినాయకుడి ఆశీర్వాదం ఉండడం వల్ల వీరు ఏ పని చేసినా సక్సెస్ ఫుల్ గానే పూర్తి చేస్తారు. ఈ రాశి వాళ్ళు బుధవారం రోజు వినాయకుని పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. వినాయకుడి అనుగ్రహంతో వీరికి సమాజంలో మంచి పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. మంచి ఆదాయం కూడా ఉంటుంది.
మకర రాశి
మకర రాశికి శనీశ్వరుడు అధిపతి. ఈ రాశి వారిపై కూడా వినాయకుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. వినాయకుడి ఆశీర్వాదంతో వీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. విద్యారంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొనే స్వభావం వీరికి ఉంటుంది. వినాయకుడిని పూజించి వినాయకుడి ఆశీర్వాదం పొందితే వీరికి తిరుగే ఉండదు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications