Lunar eclipse 2023: చంద్రగ్రహణం..4రాశుల వారిపై ప్రతికూల ప్రభావం; తస్మాత్ జాగ్రత్త!!
ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం, అది కూడా అరుదైన పెనుంబ్రల్ చంద్రగ్రహణం మే 5వ తేదీన ఏర్పడబోతుంది. ఈసారి చంద్రగ్రహణం మే 5వ తేదీన 08:44 ప్రారంభమై, ఆరవ తేదీ ఉదయం 01:01 లకు ముగుస్తుంది. చంద్రగ్రహణం ప్రభావం మనపై ఉంటుందని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులపై చంద్రగ్రహణం తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. వారంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
చంద్రగ్రహణం.. ఈ రాశులపైనే ప్రతికూల ప్రభావం : అయితే ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం ఏ ఏ రాశుల వారి జీవితాల్లో పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం వృషభ రాశి వారికి ఏ మాత్రం మంచిది కాదు. మే 5వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా వృషభ రాశి వారు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి : వృషభ రాశి పై చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించకుండా ఉండాలని సూచించబడింది.
వృశ్చిక రాశి :ఇక చంద్రగ్రహణం కారణంగా వృశ్చిక రాశి వారు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వృశ్చిక రాశి వారు చేసే పని పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. డబ్బుకు సంబంధించి ఏదైనా పని చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి అని, లేదంటే అతిపెద్ద ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మిథునరాశి : ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మిధున రాశి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని చెబుతున్నారు. మిధున రాశి వారికి ఈ సమయంలో గణనీయంగా ఖర్చులు పెరుగుతాయని, కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మిధున రాశి జాతకులకు మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
కన్యారాశి : చంద్ర గ్రహణం కారణంగా కన్యారాశి జాతకులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యా రాశి పైన కూడా చంద్రగ్రహణం తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కన్య రాశి జాతకులు మొత్తం 15 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎలాంటి అనవసరమైన ఖర్చులు లేకుండా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కాబట్టి ఈ రాశి వారు తస్మాత్ జాగ్రత్త.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications